స్కూల్ బస్సు డ్రైవర్లకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు
ABN , Publish Date - Jul 31 , 2025 | 11:44 PM
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని స్కూల్ బస్సుల డ్రైవర్లకు గురువారం రామగుండం ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఉదయమే వివిధ ప్రాం తాల్లో బస్సులను ఆపి పరీక్షలు జరిపారు. కొందరు స్కూల్ బస్సుల డ్రైవర్లు మద్యం సేవించి విధుల్లోకి వస్తున్నారనే సమాచారంతో పరీక్షలు జరిపామన్నారు. పిల్లల జీవితాలు డ్రైవర్ల చేతుల్లో ఉంటాయన్నారు.
కోల్‌సిటీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని స్కూల్ బస్సుల డ్రైవర్లకు గురువారం రామగుండం ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఉదయమే వివిధ ప్రాం తాల్లో బస్సులను ఆపి పరీక్షలు జరిపారు. కొందరు స్కూల్ బస్సుల డ్రైవర్లు మద్యం సేవించి విధుల్లోకి వస్తున్నారనే సమాచారంతో పరీక్షలు జరిపామన్నారు. పిల్లల జీవితాలు డ్రైవర్ల చేతుల్లో ఉంటాయన్నారు. ప్రమాదాలు జరుగకూడదనే ముందస్తు చర్యల్లో భాగం గా తనిఖీలు జరిపినట్టు ఎస్‌ఐ హరిశేఖర్ పేర్కొన్నారు.
ధర్మారం, (ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రైవేటు స్కూల్ బస్సుల డాక్యుమెంట్స్‌ను పోలీసులు తనిఖీ చేశా రు. ప్రైవేటు పాఠశాలల బస్సులు నడుపుతున్న డ్రైవర్లు లైసెస్సును పరిశీలించిన అనంతరం డ్రంకెన్ డ్రైవ్ పరీ క్షలు నిర్వహించారు. ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ డ్రైవర్లకు సూచనలు చేశారు. ప్రతీ డ్రైవర్ విధిగా లైసెన్స్ కలిగి ఉండాలని, రోడ్డుపై ఉండే టాఫిక్ సూచికలను పాటి స్తూ, నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన కఠిన చర్యలు ఉంటాయని ఎస్‌ఐ హెచ్చరించారు.
ఓదెల, (ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థల బస్సులు నడి పిస్తే డ్రైవర్లపై కఠినచర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ దీకొండ రమేష్ తెలిపారు. పొత్కపల్లిలో ప్రైవేట్ పాఠ శాలలకు చెందిన బస్సులను తనిఖీ చేశారు. వాహన డాక్యుమెంట్, డ్రైవర్లు పాటించవలసిన నిబంధన లపై అవగాహన కల్పించా రు. ఎస్‌ఐ మాట్లాడుతూ, వాహనాలు కండిషన్‌లో ఉండాలని, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ పర్మిట్లు, డ్రైవర్లకు డ్రైవిం గ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలని కోరారు. డ్రైవర్లు యూని ఫామ్ ధరించాలన్నారు. పరిమితికి మించి విద్యార్థులను తరలించవద్దని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని కోరారు.