రైల్వేస్టేషన్లను సందర్శించిన డీఆర్‌ఎం
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:07 PM
పెద్దపల్లి రైల్వే జంక్షన్‌తోపాటు బైపాస్ స్టేషన్‌ను మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్ సందర్శించారు. స్టేషన్ ఆధునికీకరణ పనులను పరిశీలించారు.
పెద్దపల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి రైల్వే జంక్షన్‌తోపాటు బైపాస్ స్టేషన్‌ను మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్ సందర్శించారు. స్టేషన్ ఆధునికీకరణ పనులను పరిశీలించారు. పనులను వేగవంతంగా చేప ట్టేం దుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం జరుగు తుం డడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నూతన బైపాస్ రైల్వే క్యాబిన్‌ను పరి శీలించారు. పెద్దపల్లి జంక్షన్‌లో 12643/44 తిరువనంతపురం స్వర్ణజయం తి వీక్లీ, 12252/51 వైన్ గంగా బై వీక్లీ ఎక్స్‌ప్రెస్, 16367/68 కాశీ తమిళ సంగమం వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలపాలని ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం సభ్యుడు జాన్ వెస్లీ డీఆర్‌ఎంకు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు.
ఓదెల, (ఆంధ్రజ్యోతి): ఓదెల రైల్వేస్టేషన్ మౌలిక సమస్యలపై సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్‌ఎం డా.ఆర్.గోపాలకృష్ణన్ ప్రత్యేక సర్వే నిర్వహిం చారు. రైల్వేస్టేషన్‌ను సందర్శించిన ఆయన రెండు ఫ్లాట్‌ఫామ్‌లపై ఉన్న సమస్యలను నమోదు చేసుకున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, ప్రయాణి కులకు నీడ కోసం షెడ్ల నిర్మాణం పరిశీలించారు. గేటు వద్ద ఉన్న సమస్యలను సిబ్బందిని తెలుసుకున్నారు. వాహనాల పార్కింగ్, రిజ ర్వేషన్ కౌంటర్ పరిశీలించారు. ఓదెల రైల్వేస్టేషన్‌లో దానాపూర్, తిరు మల తిరుపతి, అండమాన్, లక్నో, ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని బీజేపీ నాయకులు కోరారు. రైల్వేస్టేషన్‌లో రెండు వైపులా ప్లాట్‌ఫామ్‌ల మర మ్మతు, అండర్ బ్రిడ్జి వరకు 32 ఫీట్ల సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. అండర్ బ్రిడ్జి కింద నీరు నిలిచి వాహనదారులు, రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, అండర్ బ్రిడ్జి కింద నీటి నిల్వలు ఉండ కుండా పనులు చేపట్టాలని పేర్కొన్నారు. అధికారులు, అభిరామ్, సుశాం త్ కుమార్, శ్రీవాస్తవ, విశ్వేశ్వర్‌రావు పాల్గొన్నారు. డీఆర్‌ఎంకు బీజేపీ నాయకులు కారెంగుల శ్రీనివాస్, తీర్థాల కుమారస్వామి, రాకేష్, మేర్గు రంగయ్య, రామినేని రాజేంద్రప్రసాద్, శాతాళ్లకుమార్, కృష్ణమాచారి, వెంకటేశ్వర్లు, అశోక్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.