Share News

రైల్వే స్టేషన్లను సందర్శించిన డీఆర్‌ఎం

ABN , Publish Date - May 15 , 2025 | 11:50 PM

రామగుండం రైల్వేస్టేష న్‌ను గురువారం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌ రైల్వే మేనేజర్‌ భరతేష్‌కుమార్‌ సందర్శించారు. డీఆర్‌ఎం రైల్వేస్టేషన్‌ పరిధిలో విద్యుత్‌ ఉపకేంద్రంతోపాటు వర్క్‌ షాప్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రయాణి కులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు రైల్వే సంస్థ నిరంతర కృషి చేస్తుందని పేర్కొన్నారు.

రైల్వే స్టేషన్లను సందర్శించిన డీఆర్‌ఎం

అంతర్గాం, మే 15(ఆంధ్రజ్యోతి): రామగుండం రైల్వేస్టేష న్‌ను గురువారం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌ రైల్వే మేనేజర్‌ భరతేష్‌కుమార్‌ సందర్శించారు. డీఆర్‌ఎం రైల్వేస్టేషన్‌ పరిధిలో విద్యుత్‌ ఉపకేంద్రంతోపాటు వర్క్‌ షాప్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రయాణి కులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు రైల్వే సంస్థ నిరంతర కృషి చేస్తుందని పేర్కొన్నారు. కుందనపల్లి వద్ద ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డీఆర్‌యూసీసీ మెంబర్‌ జీన్స్‌ అనూమస శ్రీనివాస్‌ డీఆర్‌ఎంకు వినతిపత్రం అందజేశారు. రైల్వే కాంట్రాక్టు కార్మి కులకు జీవో ప్రకారం వేతనాలు అందజేయాలని సీఐటీయూ నాయకులు ఎం.రామాచారి వినతిపత్రం అందజేశారు. అధికారులు సురేష్‌రెడ్డి, బాలాజీ, కిరణ్‌, కార్తీక్‌, మునిరాం మీనా, పాపారావు, పాల్గొన్నారు.

పెద్దపల్లిటౌన్‌, (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి రైల్వే జంక్ష న్‌ను దక్షిణ మధ్య రైల్వే జోన్‌ సికింద్రాబాద్‌ డివిజన్‌ రైల్వే మేనేజర్‌ భరతేష్‌ కుమార్‌ సందర్శించారు. పెద్దపల్లిలో సూపర్‌ ఫాస్ట్‌ రైళ్ళు నిలుపాలని ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం ఉపాధ్యక్షుడు అజయ్‌ర కాంతి సింగ్‌, ఎగ్జిక్యూటివ్‌ సభ్యు డు దేవిసింగ్‌ ఠాకూర్‌లు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ సూపర్‌ ఫాస్ట్‌, స్వర్ణ జయంతి, భగత్‌ కోటి రైళ్ళను నిలుపుతామని మేనేజర్‌ హామీ ఇచ్చారన్నారు. వీటితోపాటు ప్రస్తుతం బల్లార్షా నుంచి కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ రైలును చర్లపల్లి వరకు పొడిగించాలని కోరారు. తిరుపతి నుంచి కరీంనగర్‌ బై వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నిజామాబాదు వరకు పొడిగించాలని, అలాగే పెద్దపల్లి బైపాస్‌ వద్ద నూతన రైల్వే స్టేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు.

Updated Date - May 15 , 2025 | 11:50 PM