Share News

సింగరేణి కార్మికులకు డబుల్‌ బొనంజా

ABN , Publish Date - Sep 26 , 2025 | 11:55 PM

సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బొనంజా నెలకొంది. దసరా, దీపావళి సందర్భంగా 40వేల కార్మిక కుటుంబాలకు లాభాల వాటా, బోనస్‌లు అందనున్నాయి. ప్రభుత్వ రంగంలో ఏ పరిశ్రమలో లేని విధంగా సింగరేణి కార్మిక వర్గం రెండు దశాబ్దాలుగా పొందుతున్నారు.

సింగరేణి కార్మికులకు డబుల్‌ బొనంజా

గోదావరిఖని, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బొనంజా నెలకొంది. దసరా, దీపావళి సందర్భంగా 40వేల కార్మిక కుటుంబాలకు లాభాల వాటా, బోనస్‌లు అందనున్నాయి. ప్రభుత్వ రంగంలో ఏ పరిశ్రమలో లేని విధంగా సింగరేణి కార్మిక వర్గం రెండు దశాబ్దాలుగా పొందుతున్నారు. లాభాల వాటా 34శాతానికి పెరిగి వేల నుంచి లక్ష రూపాయలు కార్మికులకు అందుతున్నాయి. సంస్థ లాభాలు పెరుగుతున్న కొద్ది కార్మికులకు వాటాశాతం పెర గడంతో పాటు ఆర్థిక ప్రయోజనం పెరుగుతోంది. 10శాతంతో ప్రారంభమైన లాభాల వాటా ఇప్పుడు 34శాతానికి పెరిగింది. 2000సంవత్సరం రూ.300 కోట్ల లాభాలు ఉన్న సింగరేణి ఇప్పుడు రూ.6వేల కోట్ల లాభాలను ఆర్జిస్తున్నది. ఈ సంవత్సరం సింగ రేణి కార్మికుల లాభాల వాటా రూ.800కోట్లు కేటా యించగా ఒక్కో కార్మికుడికి సరాసరి రూ.2లక్షలు. ఈ నెలాఖరున దసరా డబ్బులు కార్మికుల ఖాతాల్లో జమ అవుతాయి. సెప్టెంబరుకు సంబంధించిన సింగరేణి కార్మికుల వేతనాలు రూ.400కోట్లపైబడి ఉంటాయి. దసరా అడ్వాన్స్‌ రూ.25వేల చొప్పున రూ.100కోట్లు కార్మికుల ఖాతాల్లో కేవలం పది రోజుల్లోనే జమ కానున్నాయి. అంటే మొత్తం 40వేల మంది సింగరేణి కార్మికులకు రూ.1300కోట్లు పది రోజుల్లోనే ఖాతాల్లో జమకానున్నాయి. అక్టోబరులో వేతనాలు రూ.400కోట్లతో పాటు పీఎల్‌ఆర్‌ బోనస్‌ అంటే దీపావళి బోనస్‌ మరో రూ.400కోట్లు నెల రోజుల్లోనే రూ.800కోట్లు కూడా సింగరేణి కార్మికుల ఖాతాల్లో జమ అవుతాయి. సరాసరిగా ఒక్కో కార్మి కుడికి రూ.5లక్షల నుంచి రూ.8లక్షల వరకు ఆర్థిక ప్రయోజనం జరుగుతుంది. 40వేల కుటుంబాల్లో ఈ ఆర్థిక వెసులుబాట పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేయనున్నది.

కొత్త బట్టలు, కార్లు, ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయనున్నారు. కోల్‌బెల్ట్‌ ప్రాంతంలోని పది జిల్లాల్లో ఈ ఆర్థిక ప్రభావం కనిపించనున్నది. సింగరేణి పర్మినెంట్‌ కార్మికులకే కాకుండా సంస్థలో పని చేస్తున్న 30వేల కాంట్రాక్టు కార్మికులకు సైతం దసరా బోనస్‌గా ఒక్కొక్కరికి రూ.5,500 చెల్లిస్తున్నది. ఇది చిన్న మొత్తమైనా 30వేల మందికి రూ.16.5కోట్లు లబ్ధి జరుగనున్నది. కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో, పరిసర గ్రామాల్లో నాలుగైదు లక్షల మంది ఉల్లాసంగా, ఉత్సాహంగా పండుగను జరుపుకునే వాతావరణం ఏర్పడింది. ఆర్థిక వెసులు బాటుకు తోడు సాంస్కృతిక శోభను సంతరిం చుకునే తొమ్మిది రోజుల సద్దుల బతుకమ్మ సంబ రాలు, దుర్గాదేవి శరన్నవరాత్రులు కోల్‌బెల్ట్‌లో కొత్త ఉత్తేజాన్ని ఏర్పాటు చేశాయి.

Updated Date - Sep 26 , 2025 | 11:55 PM