డబుల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయించాలి
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:14 AM
ప్రభుత్వం డబుల్‌బెడ్‌రూంలు, నిరుపేదల అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని బుధవారం డబుల్‌బెడ్‌రూం ఇండ్ల ఎదుట నిరసన, రాస్తారోకో నిర్వహించారు. తహసీ ల్దార్ జగదీశ్వర్‌రావుకు వినతిపత్రం అందజేశారు.
కాల్వశ్రీరాంపూర్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం డబుల్‌బెడ్‌రూంలు, నిరుపేదల అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని బుధవారం డబుల్‌బెడ్‌రూం ఇండ్ల ఎదుట నిరసన, రాస్తారోకో నిర్వహించారు. తహసీ ల్దార్ జగదీశ్వర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. కిసాన్‌మోర్చా జిల్లా అధ్య క్షుడు గూడెపు జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ డబుల్‌బెడ్‌రూంలు వస్తాయని ఆశ పడ్డ నిరుపేదలకు ఇంతవరకు మంజూరు చేయలేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా నిరుపేదలందరికీ రాలేదని, గ్రామానికి 100ఇండ్లు మంజూరు చేయా లన్నారు. ఇందిరమ్మ ఇంటికి ఇచ్చే రూ.5లక్షలను పెంచాలని, ఇళ్లు కట్టుకోవ డానికి ముడిసరుకు, కూలీరేట్లు పెరిగిన కారణంగా నిరుపేదలు అప్పు చేయ వలసి వస్తుందని తహసీల్దార్‌కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ముల్కోజు వెంకటేశ్వర్లు, చల్ల చంద్రమౌళి, ఎండి.రఫీ, సుందర్‌రాజు, సల్పాల బాలకృష్ణ, కాల్వ రాధాకృష్ణారెడ్డి, కొమురయ్య, వైకుంఠం, ఆంజనేయులు, రాజ్‌కుమార్, తిరుపతిరెడ్డి, కిరణ్‌రెడ్డి, శివకుమార్, మహేందర్ పాల్గొన్నారు.