Share News

రాజకీయ పబ్బంతో మమ్మల్ని అభాసుపాలు చేయొద్దు

ABN , Publish Date - Dec 10 , 2025 | 11:35 PM

బీఆర్‌ఎస్‌ నాయకుడిగా చెప్పుకుంటున్న హరీష్‌రెడ్డి ముఖమే తమకు తెలియదని, అతడిని ఎన్నడూ చూడలేదని గోదావరిఖని గొర్రెల, మేకల పెంపకందారుల సహకార సంఘం నాయకులు మేరుగు గట్టయ్య, మొగిలి కడి యాల జంపయ్య, మేరుగు రాజేష్‌లు పేర్కొన్నారు. బుధవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 రాజకీయ పబ్బంతో మమ్మల్ని అభాసుపాలు చేయొద్దు

కళ్యాణ్‌నగర్‌, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నాయకుడిగా చెప్పుకుంటున్న హరీష్‌రెడ్డి ముఖమే తమకు తెలియదని, అతడిని ఎన్నడూ చూడలేదని గోదావరిఖని గొర్రెల, మేకల పెంపకందారుల సహకార సంఘం నాయకులు మేరుగు గట్టయ్య, మొగిలి కడి యాల జంపయ్య, మేరుగు రాజేష్‌లు పేర్కొన్నారు. బుధవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎక్కడో అమెరికా నుంచి వచ్చి ఇక్కడి పరిస్థితులు తెలియకుండా మా గురించి, మా వ్యాపారం గురించి తెలియకుండా హరీష్‌రెడ్డి మమ్మల్ని అబాసుపాలు చేసే చర్యలకు పాల్పడు తున్నారన్నారు. 50ఏళ్లుగా తమ తాతముత్తాతల నుంచి ఇక్కడ మేకలు, గొర్రెలను పెంచుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నామని, ఎప్పుడు కూడా మమ్మల్ని ఎవరూ డబ్బులు అడిగిన పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్యేగా రాజ్‌ ఠాకూర్‌ ఎన్నికైన తరువాత మా సమస్యలపై సాను కూలంగా స్పందించారని, మార్కెట్‌కు ఇరువైపులా రోడ్లు నిర్మించారన్నారు. తమ సంఘానికి ఎళ్లవేళలా అండగా ఉంటున్నాడన్నారు. మాకు, ఎమ్మెల్యేకు మధ్య దూరం పెంచేందుకు హరీష్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు మమ్మల్ని మధ్యలోకి లాగి అభాసుపాలు చేసే ప్రయత్నం చేస్తు న్నాడని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. మమ్మల్ని అడ్డంపెట్టి ఎమ్మెల్యేపై బురదజల్లే యత్నా లను మానుకోవాలని, రాజకీయంగా ఎమ్మెల్యేను ఎదు ర్కొవాలంటే అతన్నే నేరుగా ఎదుర్కొవాలని, మమ్మల్ని మధ్యలో లాగవద్దన్నారు. విలేకరుల సమావేశంలో నాయకులు తిరుపతి, ఎల్లయ్య, మొగిలి మొండేల్‌, మల్లేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 10 , 2025 | 11:35 PM