యువత గొడవల్లో తలదూర్చవద్దు
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:37 PM
గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంలో చదువు కున్న యువత గొడవలకు వెళ్లితే పోలీసు కేసుల వుతాయని, దీని వల్ల భవిష్యత్‌లో ఉద్యోగాలు పొందే క్రమంలో ఇబ్బందులు పడుతారని డీసీపీ రాంరెడ్డి తెలిపారు. సోమవారం పలు గ్రామా ల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీ లించారు.
కాల్వశ్రీరాంపూర్, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంలో చదువు కున్న యువత గొడవలకు వెళ్లితే పోలీసు కేసుల వుతాయని, దీని వల్ల భవిష్యత్‌లో ఉద్యోగాలు పొందే క్రమంలో ఇబ్బందులు పడుతారని డీసీపీ రాంరెడ్డి తెలిపారు. సోమవారం పలు గ్రామా ల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీ లించారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థులు యువత గ్రామస్తులతో సమావేశం నిర్వహిం చారు. గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నదని, అవసరం మేరకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ప్రశాంతంగా ప్రచారం నిర్వహించుకోవాలని, ఎలాంటి గొడవలు జరిగినా చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. యువత ఈ విష యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండలంలో తొమ్మిది గ్రామాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని, ఎలాంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐ వెంకటేష్, ఏఎస్‌ఐ నీలిమ, హెడ్‌కానిస్టేబుల్ ఆనంద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.