Share News

రక్తదానం ప్రాణదానంతో సమానం

ABN , Publish Date - Oct 25 , 2025 | 11:51 PM

రక్తదానం ప్రాణదానంతో సమానమని డీసీపీ కరుణాకర్‌ అన్నారు. పోలీస్‌ అమరవీరుల వారో త్సవాల భాగంగా సుల్తానాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

రక్తదానం ప్రాణదానంతో సమానం

సుల్తానాబాద్‌, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): రక్తదానం ప్రాణదానంతో సమానమని డీసీపీ కరుణాకర్‌ అన్నారు. పోలీస్‌ అమరవీరుల వారో త్సవాల భాగంగా సుల్తానాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కాల్వ శ్రీరాంపూర్‌, ఓదెల ఎలిగేడు, జూలపల్లి, సుల్తానాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పోలీస్‌ సిబ్బంది, సీఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐలు, యువత పాల్గొని రక్తదానం చేశారు. డీసీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు సకాలంలో రక్తం అందక చాలా మంది మృత్యువాత పడుతున్నారన్నారు. యువత సన్మార్గంలో పయనించి శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడా లని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ పోలీసులకు సహకరిం చాలన్నారు.

ట్రాఫిక్‌ నియమ నిబంధనలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు ఉండవని, పోలీసులు ప్రజల కోసమే 24 గంటలు విధి నిర్వహణలో ఉంటారన్నారు. అనంతరం మృతి చెందిన పోలీస్‌ అమరవీరులకు మౌనం పాటించారు. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ సీఐలు సుబ్బారెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌, ఎస్‌ఐలు శ్రావణ్‌ కుమార్‌, అశోక్‌ రెడ్డి, వేణుగోపాల్‌, రమేష్‌, సన్నత్‌ కుమార్‌, మదుకర్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా చైర్మన్‌ కావేటి రాజగోపాల్‌, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధి వలస నీలయ్య, స్పోర్ట్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు ముత్యాల రవీందర్‌ యువత రక్తదానం చేశారు.

Updated Date - Oct 25 , 2025 | 11:51 PM