Share News

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు

ABN , Publish Date - May 27 , 2025 | 12:08 AM

మద్యం సేవించి వాహనాలను నడుపవద్దని సుల్తానా బాద్‌ సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఆవర ణలో ఆటో డ్రైవర్లతో ఏర్పాటు చేసిన సమా వేశంలో మాట్లాడారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు జరుగకుండా వాహనా లను నడుపాలని, సురక్షితంగా గమ్యం చేరుకో వడమే కాకుండా ప్రయాణికుల భద్రత ఆలోచిం చాలన్నారు.

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు

సుల్తానాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): మద్యం సేవించి వాహనాలను నడుపవద్దని సుల్తానా బాద్‌ సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఆవర ణలో ఆటో డ్రైవర్లతో ఏర్పాటు చేసిన సమా వేశంలో మాట్లాడారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు జరుగకుండా వాహనా లను నడుపాలని, సురక్షితంగా గమ్యం చేరుకో వడమే కాకుండా ప్రయాణికుల భద్రత ఆలోచిం చాలన్నారు.

గంజాయి, డ్రగ్స్‌ అక్రమంగా రవాణా, విక్రయించడం వంటి విషయాలను పోలీసులకు తెలుపాలన్నారు. పలు అటో స్టాం డ్‌లలో అనుమానాస్పద, అపరిచిత వ్యక్తులు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆటోలను లైసెన్స్‌ కలిగి ఉన్న వ్యక్తులు మాత్రమే నడపాలని, అన్ని పత్రాలు వెం ట ఉండాలన్నారు. ఒకవేళ లైసె న్స్‌ లేని వ్యక్తులు ఎవరైనా ఉం టే తమను సంప్రదిస్తే ఇప్పిం చేందుకు కృషి చేస్తామ న్నారు. ఆటోలలో పరిమితి మేరకు ప్రయాణి కులను అనుమతించా లని సూచించారు. ఎస్‌ఐ శ్రావణ్‌ కుమార్‌ తో పాటు ఆటో యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు నాంపల్లి ఉన్నారు.

Updated Date - May 27 , 2025 | 12:08 AM