Share News

ప్రైవేట్‌ ఆసుపత్రి సిబ్బందిపై డీఎంహెచ్‌వో దౌర్జన్యం

ABN , Publish Date - Apr 27 , 2025 | 12:41 AM

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధి కారి అన్నప్రసన్న వివాదంలో చిక్కుకున్నారు. శనివారం గోదావరి ఖని లక్ష్మీనగర్‌లోని శ్రీమమత హాస్పిటల్‌ తనిఖీకి వెళ్లిన డీఎం హెచ్‌వో రిసెప్షన్‌ కౌంటర్‌లో ఉన్న ఆనంద్‌ అనే ఉద్యోగిపై దౌర్జ న్యానికి పాల్పడ్డారు. కాలర్‌ పట్టుకుని లాక్కువెళ్లి బెదిరింపులకు పాల్పడిందని బాధితుడు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ప్రైవేట్‌ ఆసుపత్రి సిబ్బందిపై డీఎంహెచ్‌వో దౌర్జన్యం

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధి కారి అన్నప్రసన్న వివాదంలో చిక్కుకున్నారు. శనివారం గోదావరి ఖని లక్ష్మీనగర్‌లోని శ్రీమమత హాస్పిటల్‌ తనిఖీకి వెళ్లిన డీఎం హెచ్‌వో రిసెప్షన్‌ కౌంటర్‌లో ఉన్న ఆనంద్‌ అనే ఉద్యోగిపై దౌర్జ న్యానికి పాల్పడ్డారు. కాలర్‌ పట్టుకుని లాక్కువెళ్లి బెదిరింపులకు పాల్పడిందని బాధితుడు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్‌ పోలీసులు డీఎంహెచ్‌వోపై కేసు నమోదు చేశా రు. వివాదానికి సంబంధించిన వివరాలు... శ్రీమమత హాస్పిటల్‌లో రిజిస్ర్టేషన్‌ లేకుండా అల్ర్టాసౌండ్‌ మిషన్‌ వినియోగిస్తున్నారని ఫిర్యాదుపై శనివారం మధ్యాహ్నం డీఎంహెచ్‌వో తనిఖీకి వెళ్ళారు. ఆసుపత్రి ఉద్యోగి ఆనంద్‌ను అల్ర్టాసౌండ్‌ మిషన్‌ ఉన్న గదిని చూప మన్నారు. తనకు ఖాళీ గదులు చూపుతున్నావంటూ ఆనంద్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. రిసెప్షన్‌ కౌంటర్‌లో ఆసుపత్రి నిర్వా హకులకు ఫోన్‌ చేసేందుకు ఉపక్రమిస్తున్న ఆనంద్‌ను ఆమె కాలర్‌ పట్టుకుని లాక్కువెళ్లింది. తాళం వేసి ఉన్న గది తాళం పగులగొ ట్టింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ గదిలో మిషన్‌ లేకపోవడంతో మిగతా గదుల్లో తనిఖీలు చేయగా డాక్టర్‌ చాంబర్‌లో అల్ర్టాసౌండ్‌ మిషన్‌ ఉన్నట్టు గుర్తించారు. గదిని సీజ్‌ చేయాల్సిందిగా ఆమె రెవెన్యూ సిబ్బందికి సూచించారు. సిబ్బంది గదిని సీజ్‌ చేసినట్టు తహసీల్దార్‌ శ్రీపాద ఈశ్వర్‌ పేర్కొన్నారు.

ఉద్దేశపూర్వకంగా కాలర్‌ పట్టుకోలేదు

గోదావరిఖనిలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో తనిఖీకి వెళ్లిన సంద ర్భంగా అల్ర్టాసౌండ్‌ ఉన్న మిషన్‌ గదిని చూపాల్సిందిగా తాను ఉద్యోగిని లాక్కువెళ్లానే తప్ప ఉద్దేశ్యపూర్వకంగా కాలర్‌ పట్టుకుని దాడి చేయలేదు. రిజిస్ర్టేషన్‌ చేయించుకున్న తరువాతనే అల్ర్టాసౌం డ్‌ యంత్రాలను వినియోగించాల్సి ఉంది. తనకు వచ్చిన ఫిర్యాదు మేరకు ముందు ఒక అధికారి వెళ్లి చూసి ధ్రువీకరించిన తరువాతే తాను తనిఖీకి వెళ్లాను. నేను తనిఖీ చేసినప్పుడు అడ్డుపడి గొడవ చేయడం మంచి పద్ధతి కాదు.

ఆసుపత్రిపై కేసు నమోదు : డీఎంహెచ్‌వో

రిజిస్ర్టేషన్‌ లేకుండా అల్ర్టాసౌండ్‌ మిషన్‌ కలిగి ఉండి, విని యోగించిన శ్రీమమత హాస్పిటల్‌పై కేసు నమోదు చేసినట్టు డీఎం హెచ్‌వో అన్నప్రసన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు శనివారం ఆసుపత్రిలో పోలీస్‌, రెవెన్యూ సిబ్బందితో కలిసి తనిఖీలు జరిపామని, స్కానింగ్‌ మిషన్‌ లేదని ఆసుపత్రి సిబ్బంది బుకాయించారన్నారు. బాత్‌ రూమ్‌లు, ఇతర రూములు చూపించా రని, చివరికి గైనకాలజిస్ట్‌ చాంబర్‌లో మిషన్‌ను గుర్తించామన్నారు. రెవెన్యూ, పోలీస్‌ సంయుక్తంగా పరిశీలించామని, 2023 నుంచి రిజి స్ర్టేషన్‌ లేకుండా స్కానింగ్‌ మిషన్‌ నడుపుతున్నారన్నారు. పీసీపీ ఎస్‌డీటీ యాక్ట్‌ను ఉల్లంఘించినందుకు ఆసుపత్రిపై కేసు నమోదు చేసినట్టు డీఎంహెచ్‌ఓ పేర్కొన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 12:41 AM