ముగిసిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:42 PM
జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం జాతీయ యువజన ఉత్సవాలను అదనపు కలెక్టర్ దాసరి వేణు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. స్వామి వివేకానంద చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి, పులమాలలు వేసి నివాళులర్పించారు.
పెద్దపల్లి కల్చరల్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం జాతీయ యువజన ఉత్సవాలను అదనపు కలెక్టర్ దాసరి వేణు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. స్వామి వివేకానంద చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి, పులమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు ఫోక్ డ్యాన్స్, సాంగ్స్, పెయింటింగ్, సైన్స్‌మేళా, పోయేట్రీ, స్టోరీ రైటింగ్ అంశాలపై పోటీలు జరిగాయి. న్యాయనిర్ణేతలుగా జాతీయ యువజన అవార్డు గ్రహీతలు ఈదునూరి శంకర్, కొండ రవి, యువజన నాయకులు కన్నూరి ఆంజనేయులు పాల్గొని విజేతలను ఎంపిక చేశారు.
జాతీయ యువజన అవార్డు గ్రహీతలను సన్మానించారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్, జిల్లా యువజన, క్రీడా అధికారి సురేష్‌లు పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఇంటర్మీ డియట్ అధికారి కల్పన, బీసీ వెల్ఫేర్ అధికారి రంగారెడ్డి, పేఅండ్ అకౌంట్ ఆఫీసర్ ప్రభాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఏఈఓ శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొని విద్యార్థులకు ప్రశంసాపత్రాలతో పాటు బహుమతులు అందించారు. విజేతలుగా గెలిచిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలి పారు. పేట అధ్యక్షుడు వేల్పుల సురేందర్, వ్యాయామ ఉపాధ్యాయులు దుర్గా ప్రసాద్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.