ముగిసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలు
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:52 PM
జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న మై భారత్, యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి స్పోర్ట్స్ మీట్ శనివారం ముగిసింది. ముఖ్య అతిథులుగా ఎస్‌ఐ నరేష్ పాల్గొని మాట్లాడారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారవద్దని తెలిపారు.
పెద్దపల్లి కల్చరల్, నవంబరు1 (ఆంధ్ర జ్యోతి): జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న మై భారత్, యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి స్పోర్ట్స్ మీట్ శనివారం ముగిసింది. ముఖ్య అతిథులుగా ఎస్‌ఐ నరేష్ పాల్గొని మాట్లాడారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారవద్దని తెలిపారు. వాలీబాల్ విభాగంలో సుల్తానా బాద్ స్పోర్ట్స్ క్లబ్ జట్టు ప్రథమ, ఖమ్మర్ ఖాన్‌పేట వివేకానంద సేవ సమితి ద్వితీయ స్థానంలో నిలిచింది.
కబడ్డీలో మంథని జేఎన్టీయూ ప్రథమ, పొత్కపల్లి మల్లికార్జున యూత్ ద్వితీయ స్థానంలో నిలిచాయి. మహి ళా విభాగం కబడ్డీలో జేఎన్‌టీయూ ప్రథమ, ఎంజేపీ ద్వితీయ స్థానంలో నిలిచాయి. విజేత లకు ముఖ్యఅతిథుల చేతుల మీదుగా బహు మతులు ప్రదానం చేశారు. సైకాలజిస్టు భూ మేష్, ఐటీఐ వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఇం చార్జి మహేందర్, వాలీబాల్ కార్యదర్శి రవీం దర్, కబడ్డీ కార్యదర్శి కర్ణాకర్, మేరా భారత్ జిల్లా వాలంటరీ మహేష్, శేఖర్, రిషి, రాకేష్, నితిన్, మహేష్, శ్రీను, పాల్గొన్నారు.