Share News

అట్టహాసంగా జిల్లా స్థాయి చదరంగ పోటీలు

ABN , Publish Date - Oct 11 , 2025 | 11:41 PM

పెద్దపల్లి జిల్లా స్థాయి చద రంగ పోటీలు ఎలిగేడు మండల కేంద్రంలో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 69వ ఎస్‌జీఎఫ్‌ జిల్లా స్థాయి అండర్‌ 14, 17 బాలబాలికల చదరంగ పోటీలు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు.

అట్టహాసంగా జిల్లా స్థాయి చదరంగ పోటీలు

ఎలిగేడు, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా స్థాయి చద రంగ పోటీలు ఎలిగేడు మండల కేంద్రంలో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 69వ ఎస్‌జీఎఫ్‌ జిల్లా స్థాయి అండర్‌ 14, 17 బాలబాలికల చదరంగ పోటీలు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్‌ ప్రారంభించారు. పోటీలకు జిల్లాలోని వివిధ పాఠ శాలల నుంచి 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆయన మాట్లా డుతూ చదరంగం గొప్ప ఆలోచనా శక్తిని ఇస్తుందన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, పట్టుదల, జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెప్పారు. విద్యార్థులు ఈ క్రీడపై ఎక్కువ దృష్టి సారించాలని, క్రీడాకారులు గెలుపోటములు సమానంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు ఎస్‌ఐ మధుకర్‌ బహుమతులు ప్రదానం చేశారు.

స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం గండ్ర దేవెందర్‌ రావు, జిల్లా చెస్‌ అసోసి యేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు గడ్డాల శ్రీనివాస్‌, బాను, మండల చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తాటిపల్లి సతీష్‌ బాబు, ఆర్గనైజర్‌ అడ్డగుంట శ్రీనివాస్‌ గౌడ్‌, భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు అక్కినపల్లి నాగరాజు, పాఠశాల విద్య కమిటీ, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రణ య్‌, వెంకటేష్‌, జావిద్‌, భాగ్యలక్ష్మి, సరస్వతి, నజియా, వెంకటలక్ష్మి, సత్యం, సురేష్‌, అజయ్‌, నరేష్‌, శేఖర్‌, అంజన్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 11:41 PM