Share News

కాళేశ్వరం ప్రాజెక్టుపై వివక్ష

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:34 AM

ఉ త్తర తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వివక్షకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి వివరాలతో మాజీ మంత్రి హరీష్‌రావు హైదా రాబాద్‌ నుంచి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై వివక్ష

పెద్దపల్లి టౌన్‌, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ఉ త్తర తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వివక్షకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి వివరాలతో మాజీ మంత్రి హరీష్‌రావు హైదా రాబాద్‌ నుంచి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. పెద్దపల్లి పార్టీ కార్యాల యంలో మాజీ జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, నాయకులతో కలిసి వీక్షించారు.

అనంతరం మధుతో కలిసి చందర్‌ మాట్లాడుతూ ఏమైనా చిన్న లోపా లుంటే తక్షణమే మరమ్మతులు చేపట్టి నీటిని లిఫ్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజక్టు నుంచి నీరు వృథాగా పోతోందని, ఆనకట్టలను మరమ్మతు చేసి నీటిని నిల్వ చేసి రైతులకు సాగు నీరం దించాలన్నారు. కాం గ్రెస్‌ కుట్రలు, మోసా లకు ప్రజలకు తెలి యజేయాలని పార్టీ శ్రేణులకు చందర్‌ పిలుపునిచ్చారు. నా యకులు కౌశిక హరి, గంట రాములు, దాస రి ఉష, రఘువీర్‌ సింగ్‌, మురళీధర్‌ రావు, రాజ్‌ కుమార్‌, గోపు ఐలయ్య, నారాయణదాసు మారుతి, ముత్యాల రాజయ్య, పందిల్ల లక్ష్మణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 12:34 AM