అంగవైకల్యం శరీరానికే మనస్సుకు కాదు
ABN , Publish Date - Dec 04 , 2025 | 12:09 AM
అంగవైక్యలం శరీరానికే కానీ, మనసుకు కాదని అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు. బుధవా రం జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వ హించిన అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
పెద్దపల్లి కల్చరల్, డిసెంబరు3(ఆంధ్రజ్యోతి): అంగవైక్యలం శరీరానికే కానీ, మనసుకు కాదని అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు. బుధవా రం జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వ హించిన అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. దివ్యాం గులు మనోధైర్యంతో జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అందిస్తుందని వివరించారు. అన్ని రంగాల్లో రిజర్వేషన్లు, వసతులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరారు. న్యాయపరమైన సహాయం కోసం జిల్లా లీగల్ సెల్ అథారిటిని ఉపయోగించుకొని న్యాయం పొందాల న్నారు. సదరం క్యాంపును దివ్యాంగులు అవకాశం మేరకు వినియో గించుకోవాలన్నారు. చీఫ్ డిపెన్స్ లీగల్ లీడ్ శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ భాను, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు, అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, డీఎంహెచ్‌ఓ వాణిశ్రీ, అడిషనల్ డీఆర్‌డీఏ శ్రీనివాస్, సూపరింటెండెంట్ రాయ్య, ఎఫ్‌ఆర్‌ఓ స్వర్ణలతతోపాటు అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు.
భవిత సెంటర్‌ను వినియోగించుకోవాలి
పెద్దపల్లి కల్చరల్, డిసెం బరు 3(ఆంధ్రజ్యోతి): భవిత్ సెంటర్‌ను దివ్యాంగ విద్యార్థు లు వినియోగించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నా రు. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సం దర్భంగా జడ్పీ ఉన్నత పాఠ శాల ఆవరణలో నిర్మించిన భవిత కేంద్రాన్ని ప్రారంభిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ భవిత సెంటర్‌లో వారంలో రెండుసార్లు విద్యార్థులకు ఫిజియెథెరపి చేస్తా రని, భవిత సెంటర్‌లో దివ్యాంగ విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్ సూచించారు. భవిత సెంటర్‌లో చదివే దివ్యాంగ విద్యార్థులకు యేటా ప్రభుత్వం రూ.5 వేల స్కాలర్ షిప్ అందిస్తున్నట్లు, దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, జిల్లా విద్యాధికారి శారద, ఎంఈఓ సురేందర్ కుమార్, ఎస్‌ఓ కవిత, ఐఆర్‌పీలు సంధ్యారాణి, రజని, అధికారులు పాల్గొన్నారు.