Share News

నిరసనలో పాల్గొని గుండెపోటుతో మృతి

ABN , Publish Date - Jul 10 , 2025 | 12:21 AM

దొంగతుర్తి గ్రామానికి చెందిన ఆకుల రాజయ్య (55) బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. పారిశుధ్య సంఘం మండల అధ్యక్షుడైన రాజయ్య సార్వత్రిక సమ్మెలో భాగంగా మండల కేంద్రంలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం ఉదయం చేరుకొని కార్మికులందరినీ ఏకం చేశాడు.

నిరసనలో పాల్గొని గుండెపోటుతో మృతి

ధర్మారం, జులై 9 (ఆంధ్రజ్యోతి): దొంగతుర్తి గ్రామానికి చెందిన ఆకుల రాజయ్య (55) బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. పారిశుధ్య సంఘం మండల అధ్యక్షుడైన రాజయ్య సార్వత్రిక సమ్మెలో భాగంగా మండల కేంద్రంలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం ఉదయం చేరుకొని కార్మికులందరినీ ఏకం చేశాడు. అనంతరం వ్యవ సాయ మార్కెట్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొని అక్కడి నుంచి ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని డిప్యుటీ తహసీల్దార్‌ ఉదయ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. అంతలోనే రాజయ్యకు చెమటలు పెట్టి అస్వస్థ తకు గురయ్యాడు. తోటి కార్మికులు హుటా హుటిన ద్విచక్ర వాహనంపై స్థానిక హాస్పిట ల్‌కు తరలించారు. డాక్టర్‌ రాజు సీపీఆర్‌ చేసినా రాజయ్య స్పందించలేదు. అంబులెన్ప్‌లో కరీం నగర్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కార్మికుల పక్షాన నిరసన కార్యక్రమం నిర్వహించిన కొద్ది నిమిషాల్లోనే హఠాన్మరణం చెందడంతో పారిశుధ్య కార్మికుల్లో విషాదం నెలకొంది.

రాజయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి

దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో పాల్గొని గుండెపోటుతో మృతి చెందిన ఆకుల రాజయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కరీంనగర్‌- రాయపట్నం రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద రాజయ్య చిత్రపటానికి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. బీఆర్‌ఎప్‌ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్‌ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు సమ యానికి జీతాలు రాక వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. ఆకుల రాజయ్య కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వా లని డిమాండ్‌ చేశారు. పూస్కూరి రామరావు, ఎగ్గెల స్వామి, కోమటిరెడ్డి మల్లారెడ్డి, దాడి సదయ్య, పాక వెంకటేశం, నాడం శ్రీనివాస్‌, గాజుల రాజు, దేవి వంశీ, రాజేందర్‌, ఆవుల వేణు, నారా ప్రేమ్‌సాగర్‌, ఆజాం బాబ, గుమ్ముల నర్సయ్య, చందు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 12:21 AM