ఆర్‌టీసీ డిపో ఎదుట రిటైర్డ్ కార్మికుల ధర్నా
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:56 PM
ఆర్టీ సీలో రిటైరైన ఉద్యోగుల సమస్యలు పరిష్కరిం చాలని సోమవారం గోదావరిఖని ఆర్‌టీసీ డిపో ఎదుట రిటైర్డ్ ఉద్యోగులు ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ కో ఆర్డినేటర్లు రాజేందర్, బాణయ్య మాట్లాడుతూ రిటైర్డ్ అయిన కార్మికులకు ఏళ్ల తరబడి రావా ల్సిన బకాయిలు చెల్లించడం లేదని, పెన్షన్ కూడా సక్రమంగా ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తు న్నారని, 35సంవత్సరాలు ఆర్‌టీసీలో పని చేసిన తమకు రావాల్సిన బకాయిలపై యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందన్నారు.

కళ్యాణ్‌నగర్, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ఆర్టీ సీలో రిటైరైన ఉద్యోగుల సమస్యలు పరిష్కరిం చాలని సోమవారం గోదావరిఖని ఆర్‌టీసీ డిపో ఎదుట రిటైర్డ్ ఉద్యోగులు ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ కో ఆర్డినేటర్లు రాజేందర్, బాణయ్య మాట్లాడుతూ రిటైర్డ్ అయిన కార్మికులకు ఏళ్ల తరబడి రావా ల్సిన బకాయిలు చెల్లించడం లేదని, పెన్షన్ కూడా సక్రమంగా ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తు న్నారని, 35సంవత్సరాలు ఆర్‌టీసీలో పని చేసిన తమకు రావాల్సిన బకాయిలపై యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందన్నారు. బకాయిలు తాము చనిపోయినా తరువాత ఇస్తారా అని రిటైర్డ్ కార్మికులు ప్రశ్నించారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాం డ్లను ఆర్‌టీసీ డిపో మేనేజర్ నాగభూషణంకు అందజేశారు. రిటైర్డ్ ఉద్యోగులు కనకయ్య, బెంజి మెన్, జీజే రెడ్డి, ఎంజీఎం రెడ్డి, తిరుపతి, అహ్మద్, ఏకేరెడ్డి, మల్లేషం పాల్గొన్నారు.