Share News

ఘనంగా ప్రారంభమైన దేవీశరన్నవరాత్రులు

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:48 PM

దసరా పండుగను పురస్కరిం చుకొనిదేవీ శరన్నవరాత్రోత్సవాలు సోమ వారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మంథనిలోని మహాలక్ష్మీ ఆలయంలో వేద పండితులు అమ్మ వారికి అఖండ దీపారాధన, పుణ్యాఃవచనం, కలశ స్థాప నం, నాథబ్రాహ్మ సప్తాహా దీక్షతో శరన్న వరాత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు.

ఘనంగా ప్రారంభమైన దేవీశరన్నవరాత్రులు

మంథని, సెప్టెంబరు 22 (ఆంధ్ర జ్యోతి): దసరా పండుగను పురస్కరిం చుకొనిదేవీ శరన్నవరాత్రోత్సవాలు సోమ వారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మంథనిలోని మహాలక్ష్మీ ఆలయంలో వేద పండితులు అమ్మ వారికి అఖండ దీపారాధన, పుణ్యాఃవచనం, కలశ స్థాప నం, నాథబ్రాహ్మ సప్తాహా దీక్షతో శరన్న వరాత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు అధిక సంఖ్యలో దర్శిం చుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో సాయంత్రం సహస్ర దీపా లంకరణ సేవ నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు నిరంతరాయంగా భజన చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఆలయ సమీపంలోని పెద్ద పోచమ్మ తల్లి వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీనారాయణ స్వామి, వాసవీనగర్‌, గాంధీచౌక్‌, తమ్మ చెరువు కట్ట, ఎరుకల గూడెం, పోచమ్మవాడల్లో దుర్గాదేవి విగ్ర హాలను భక్తులు ప్రతిష్ఠించారు. పలు వురు దీక్షలను స్వీకరించారు. కన్యకాపరమేశ్వరి, లలితాంభిక ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.

కళ్యాణ్‌నగర్‌/మార్కండేయకాలనీ, (ఆంధ్రజ్యోతి): రామగుండం పారిశ్రా మిక ప్రాంతంలో దేవీ శరన్నవ రాత్రులు ప్రారంభమయ్యాయి. డప్పుచప్పుళ్ల మధ్య అమ్మవారి విగ్రహాలను మండపాలకు తరలించారు. పవర్‌హౌస్‌, జయదుర్గా దేవి ఆలయాల్లో భక్తులు దీక్షలు స్వీకరిం చారు. తొలి రోజు బాల త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిచ్చారు. జవహర్‌న గర్‌లోని జయదుర్గాదేవి ఆలయంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌, స్నేహలత దంపతులు పూజలు నిర్వహించారు.

పెద్దపల్లి రూరల్‌/ఓదెల, (ఆంధ్ర జ్యోతి): ఓదెల మల్లికార్జున స్వామి క్షేత్రంతోపాటు పలు గ్రామాల్లో దేవి శర న్నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తిశ్రద్ధలతో గ్రామాల్లో దుర్గమాత విగ్ర హాలను ఊరేగింపుగా తీసుకువచ్చి మం డపాల్లో ప్రతిష్టించి పూజలు చేశారు. పెద్దపల్లి మండలం గ్రామాల్లో ఉత్సవా లు ఘనంగా ప్రారంభమ య్యాయి.

పాలకుర్తి, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. డప్పుచప్పుళ్ళు, ఆటాపాటలతో ఊరేగింపుగా దేవి విగ్ర హాలను మండపాలలో ప్రతిష్టించి పూజ లు నిర్వహించారు. 15 దుర్గామాత విగ్ర హాలను నెలకొల్పినట్లు ఎస్‌ఐ ఆర్‌ స్వామి తెలిపారు.

Updated Date - Sep 22 , 2025 | 11:48 PM