Share News

అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:25 PM

జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాలో వివిధ ఇంజనీరింగ్‌ విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల వరకు అవసరాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, పాఠశాల అభివృద్ధి పనులకు స్కూల్‌ మేనేజ్మెంట్‌ కమిటీ తీర్మానాల ప్రకారం పూర్తి చేయాలన్నారు.

అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి

పెద్దపల్లిటౌన్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాలో వివిధ ఇంజనీరింగ్‌ విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల వరకు అవసరాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, పాఠశాల అభివృద్ధి పనులకు స్కూల్‌ మేనేజ్మెంట్‌ కమిటీ తీర్మానాల ప్రకారం పూర్తి చేయాలన్నారు. జూనియర్‌ కళాశాల అభివృద్ధి పనులకు నిధులు ఉన్నందున పనులు పూర్తి చేయాలని, తహసీల్దార్‌ కార్యాలయం నిర్మాణ పెండింగ్‌ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, డిసెంబర్‌ చివరి వరకు తహసీల్దార్‌ భవనాలు అందుబాటులోకి రావాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, పనులను వేగవంతం చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకొని రావాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లలో మరమ్మతు పనుల పురోగతి వివరాలను తెలుసుకున్న కలెక్టర్‌ వాటిని సత్వరమే పూర్తి చేయాలన్నారు.

జడ్పీ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

పెద్దపల్లి రూరల్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : జడ్పీ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం పెద్దపల్లి తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జడ్పీ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు నాణ్యతతో జరగాలని, నిర్దేశిత గడువు ఆరు నెలల్లోగా నిర్మాణ పనులు పూర్తి కావాలన్నారు. జడ్పీ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులను ఇంజనీరింగ్‌ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నాణ్యతలో రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జడ్పీ సీఈవో నరేందర్‌; పంచాయతీ రాజ్‌ శాఖ ఈఈ గిరీష్‌బాబు, తహసీల్దార్‌ రాజయ్య, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2025 | 11:25 PM