Share News

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Dec 18 , 2025 | 12:26 AM

రామగుండం కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్‌ అరుణశ్రీ హెచ్చరించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

కోల్‌సిటీ, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): రామగుండం కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్‌ అరుణశ్రీ హెచ్చరించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామగుండంలో జరుగుతున్న అభి వృద్ధి పనులకు ముందుగానే యంత్రాలు, మనుషు లు సామగ్రి ఉంచుకుని పనులను ప్రారంభించాలని, ఏ ఒక్క పనికి అంతరాయం లేకుండా కాంట్రాక్టర్లు పనులు కొనసాగించేందుకు ఇంజనీరింగ్‌ అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. నిర్ణీత కాల వ్యవధిలో అభివృద్ధి పనులను ప్రారంభించినా పూర్తి చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి కారణం లేకుండా జాప్యం జరిగినట్లు గుర్తిస్తే ఆ కాంట్రాక్టర్‌ ను బ్లాక్‌లిస్టులో పెట్టాలని, ఆక్రమణలు తొలగించి రోడ్డు వెడల్పు పనులను నిరాటకంగా కొనసాగిం చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎస్‌ఈ గురువీర్‌, ఈఈ పీవీ రామన్‌, ఏసీపీ శ్రీహరి, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి నవీన్‌, సూప రింటెండెంట్‌ పబ్బాల శ్రీనివాస్‌, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత నిర్మించాలి

రామగుండం నగరపాలక సంస్థలో ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించేలా, వర్షపు నీటిని సంర క్షించే విధంగా అవగాహన కల్పించాలని రామగుం డం నగరపాలక సంస్థ కమిషనర్‌ అరుణశ్రీ సూచిం చారు. బుధవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో జల సంచయ్‌... జల భగీరథ కార్యక్ర మంపై వార్డు అధికారులకు, సహాయకులకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పిం చారు. మార్చి 31, 2026లోపు పదివేల ఇంకుడు గుంతలను నిర్మించిన నగరపాలక సంస్థకు రూ.2కోట్ల ప్రోత్సాహక నిధులను అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం రామగుండం నగరపాలక సంస్థ దక్కించుకునేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. ఇంటింటా సర్వే నిర్వహించి కొత్తగా నిర్మించిన ఇంకుడు గుంతల వివరాలు సంబంధిత పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో నగరపాలక సంస్థ అడిషనల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌, ఈఈ రామన్‌, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్‌ నవీన్‌, సూపరిం టెండెంట్‌ పబ్బాల శ్రీనివాస్‌, ఏఈ జమీల్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2025 | 12:26 AM