అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:10 AM
రామగుండం నగర అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు, ప్రభుత్వం, సింగరేణి నిధులతో మరిన్ని సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు.
కోల్‌సిటీ, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): రామగుండం నగర అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు, ప్రభుత్వం, సింగరేణి నిధులతో మరిన్ని సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. గురువారం గోదావరిఖని చౌరస్తాలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రామగుండంలో మరో ఆరు నెలల కాలంలో షాపింగ్ కాంప్లెక్స్‌లు అందుబాటులోకి వచ్చి ప్రజలకు వాణిజ్య సౌకర్యాలు మరింత పెరుగుతా యని, పనులు వేగవంతం చేయాలని సూచించారు. కార్పొరేషన్‌లో 50డివిజన్లలో ప్రజలకు మౌలిక సదు పాయాల్లో భాగంగా రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ దీపా లు, మంచినీటి సౌకర్యాన్ని కల్పించడానికి కోట్ల రూపా యల నిధులను తీసుకువచ్చినట్టు చెప్పారు.
ప్రతి గింజను కొనుగోలు చేయాలి
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుం దని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ చెప్పారు. జనగామలో ఐకేపీ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. గ్రామానికి త్వరలో రూ.3కోట్లు కేటాయించడం జరుగుతుందని, ఇప్పటికే అండర్ గ్రౌండ్‌డ్రైనేజీ పనులకు రూ.1కోటి కేటాయించామని, జనగామలో రూ.45లక్షల వ్యయంతో బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. పంటకు దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు.
కళ్యాణ్‌నగర్, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గోదావరిఖని ప్రెస్‌క్లబ్ బాయ్ దస్తగిరి కుటుంబాన్ని గురువారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పరామర్శించారు. శివాజీనగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. దస్తగిరి మరణం తీరనిలోటని, అందరితో ఆప్యాయంగా ఉంటూ పలుకరించేవాడని, దస్తగిరి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రూ.20వేలు దస్తగిరి కుమారుడు సమీర్‌కు అందజేశారు.