కాంగ్రెస్ ప్రజాపాలనలోనే గ్రామాల అభివృద్ధి
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:19 PM
కాంగ్రెస్ ప్రజాపాలనలోనే గ్రామాలు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయని ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు పేర్కొన్నారు. ధూళికట్టలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లు అందిం చారు.
ఎలిగేడు, సెప్టెంబరు28(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రజాపాలనలోనే గ్రామాలు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయని ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు పేర్కొన్నారు. ధూళికట్టలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లు అందిం చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ధూళికట్టలో రూ.16.50 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, ప్రధాన రహదారులు, పాఠ శాల గదులు పనులను చేపట్టామన్నారు. గృహాలు ఉన్న వారికే మళ్లీ గృహాలు ఇస్తున్నట్లుగా పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందిం చారు. రానున్న రోజుల్లో ఇల్లులేని ప్రతి లబ్ధిదారునికి ఇల్లు మంజూరు చేయించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదని, రేషన్ కార్డు మంజూరు చేయలేదని విమర్శించారు. రైతులు ఎస్సా రెస్పీ ఉపకాల్వలను సక్రమంగా వినియోగించుకొని నీటిని వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల న్నారు. ఇందులో భాగంగా శంకుస్థాపనలు చేసిన అభి వృద్ధి పనుల్లో రూ.12 కోట్లతో రోడ్లు భవనాల శాఖ నిధులతో ధూళికట్ట నుంచి సుగ్లాంపల్లి డబుల్ రోడ్డు నిర్మాణం, మున్నూరుకాపు సంఘం కమ్యూనిటీ భవ నం, 33 ఇందిరమ్మ గృహాల నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. సింగిల్ విండో చైర్మన్ గోపు విజ యభాస్కర్‌రెడ్డి, ప్రత్యేక గ్రామాధికారి కిరణ్, కార్యదర్శి పున్నమయ్య, మాజీ సర్పంచ్‌లు గొల్లె కావేరి, బాల సాని పరుశరాములు గౌడ్, పడాల పర్శరాములుగౌడ్, అర్శణపల్లి వెంకటేశ్వర్‌రావు, ప్రసాద్‌రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్ రెడ్డి, నాయకులు సంతోష్‌రావు, పుల్లారావు, మహేశ్వర్‌రావు, ఏఈఓలు, జీపీ కార్యదర్శి పున్నమయ్య, మహిళలు పాల్గొన్నారు.
ఓదెల, (ఆంధ్రజ్యోతి): ఆర్థిక స్వావలంబన, మహి ళా అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. ఆదివారం కనగర్తిలో రూ.24.30 లక్షలతో నిర్మించిన మహిళ సమైక్య భవ నాన్ని ప్రారంభించారు. అలాగే రూ. 10 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి రూ.కోటికి పైగా నిధులు వెచ్చించి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధు లను గెలిపించుకుంటే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అం దుతాయన్నారు. మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ళ సుమన్ రెడ్డి, మాజీ చైర్మన్ గోపు నారాయణరెడ్డి, ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, మాజీ ఎంపీటీసీ చిన్నస్వామి, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, చొప్పరి రాజయ్య, ఉడిగె సదయ్య, కసిరెడ్డి మహేందర్ రెడ్డి, జాగిరి కిషోర్, తాళ్లపల్లి శ్రీనివాస్, రఫీ పాల్గొన్నారు.
బతుకమ్మ ఏర్పాట్ల పరిశీలన
పెద్దపల్లి కల్చరల్,(ఆంధ్రజ్యోతి): ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు తెలిపారు. ఆదివారం మున్సిపల్ అధికారులతో కలిసి ఎల్లమ్మ చెరువుకట్టను సందర్శించారు. ఆయన బతుక మ్మ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. పారిశుధ్యం, నీటి వసతి, విద్యుత్ తదితర అంశాలను తెలుసుకున్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు పాటిం చాలని, అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసు కుంటూ ముందుకు పోవాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేష్‌కు సూచించారు. అనంతరం ఆయన మీడి యాతో మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదా యాలను పరిరక్షించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముం దుంటుందన్నారు. సద్దుల బతుకమ్మ పండగలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం నిధులు కేటా యించడంపై హర్షం వ్యక్తం చేశారు. శాంతియుత వాతావరణంలో బతుకమ్మ, దసరా వేడుకలు నిర్వ హించుకోవాలని సూచించారు. ము న్సిపల్ కమిషనర్ వెంకటేష్, ఏఈ సతీష్, వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, మాజీ కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.