కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:53 PM
బీఆర్‌ఎస్ పార్టీలోని ప్రభుత్వం పదేళ్లలో చేయని అభివృద్ధిని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండేళ్లలో చేసి చూపించారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాజనవేన సదయ్య అన్నారు. ఆదివారం స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మల్యాల, పోచంపల్లి మధ్య ఉన్న నక్కలవాగుపై బ్రిడ్జి నిర్మించేందుకు ఎమ్మెల్యే రూ.76 లక్షల నిధులు మంజూరు చేశారన్నారు.
కాల్వశ్రీరాంపూర్, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీలోని ప్రభుత్వం పదేళ్లలో చేయని అభివృద్ధిని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండేళ్లలో చేసి చూపించారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాజనవేన సదయ్య అన్నారు. ఆదివారం స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మల్యాల, పోచంపల్లి మధ్య ఉన్న నక్కలవాగుపై బ్రిడ్జి నిర్మించేందుకు ఎమ్మెల్యే రూ.76 లక్షల నిధులు మంజూరు చేశారన్నారు. మరిన్ని నిధులు మంజూరు చేసేందుకు సుముఖంగా ఉన్నారన్నారు.
గత ప్రభుత్వంలో తూకంలో తరుగు, వడ్ల కటింగ్, రైసు మిల్లుల వద్ద దోపిడీతో రైతులకు న్యాయం జరగలేదన్నారు. ఎమ్మెల్యే విజయరమణరావు వంద కోట్లకు పైగా నిధులు మండలానికి తీసుకొచ్చారని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, మాజీ సర్పంచులు పొన్నమనేని దేవెందర్‌రావు, మాదాసు సతీష్, రవి, శివరామకృష్ణ, ద్యాగేటి రామచంద్రం, కాసర్ల విద్యాసాగర్ రెడ్డి, రమేష్, కాసర్ల మల్లారెడ్డి, సంది సంజీవరెడ్డి, నగేష్, రాజిరెడ్డి, శ్రీకాంత్, దయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.