గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తున్నాం
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:49 PM
పుస్తకాలే ప్రియ నేస్తాలని, విద్య అనేది గొప్ప ఆయుధమని, గత ప్రభుత్వంలో నిర్వీ ర్యమైన గ్రంథాలయ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే చిం తకుంట విజయరమణరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి డీఎంఎఫ్‌టీ ద్వారా రూ.1.50 కోట్ల నిధులతో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్‌తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
పెద్దపల్లి కల్చరల్, నవంబరు20(ఆంధ్రజ్యోతి): పుస్తకాలే ప్రియ నేస్తాలని, విద్య అనేది గొప్ప ఆయుధమని, గత ప్రభుత్వంలో నిర్వీ ర్యమైన గ్రంథాలయ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే చిం తకుంట విజయరమణరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి డీఎంఎఫ్‌టీ ద్వారా రూ.1.50 కోట్ల నిధులతో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్‌తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కేంద్ర గ్రంథా లయంలో జరిగిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
గ్రంథాలయ చైర్మన్ ఎమ్మెల్యేను సన్మా నించి నిప్పుల వాగు పుస్తకాన్ని బహుకరించారు. వారం రోజులుగా నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు అందించారు. రాబోయే 30 ఏళ్ల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని జిల్లా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడి, జిల్లా కేంద్ర గ్రంథాలయానికి 12 గుంటల స్థలాన్ని కేటాయించి, రూ.1.50 కోట్ల నిధులు మంజూరు చేయించానన్నారు. సంవత్సరంలోగా భవన నిర్మాణం పూర్తి చేసుకుం టుందన్నారు. మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్, ఎంఈఓ సురేందర్ కుమార్, మాజీ కౌన్సిలర్లు, గ్రంథాలయ సిబ్బంది, నాయ కులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.