Share News

సరస్వతీ నిలయంగా మంథని అభివృద్ధి చేస్తా

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:33 PM

మంథని నియోజకవర్గాన్ని సరస్వతీ నిలయంగా మార్చడానికి ప్రభుత్వ పరంగా కృషి చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో డివిజన్‌లోని మంథని, ముత్తారం, కమాన్‌పూర్‌, రామగిరి మండలాలకు చెందిన 87 సీఎంఆర్‌ఎఫ్‌, 38 కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు సోమవారం మంత్రి పంపిణీ చేశారు.

సరస్వతీ నిలయంగా మంథని అభివృద్ధి చేస్తా

మంథని, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): మంథని నియోజకవర్గాన్ని సరస్వతీ నిలయంగా మార్చడానికి ప్రభుత్వ పరంగా కృషి చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో డివిజన్‌లోని మంథని, ముత్తారం, కమాన్‌పూర్‌, రామగిరి మండలాలకు చెందిన 87 సీఎంఆర్‌ఎఫ్‌, 38 కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు సోమవారం మంత్రి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ రూ. 45 కోట్లతో మంథనిలో ఏటీసీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరంలో మంథనిలో ఏటీసీ సెంటర్‌ను ప్రారంభిస్తామన్నారు. ఇటీవల కాటారంలో రూ. 35 కోట్లతో ఏటీసీ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించే దిశగా ఐటీఐ కేంద్రాలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నామన్నారు. ఏటీసీ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఏటీసీ సెంటర్లలో చదివే విద్యార్థులకు నెలకు రూ. 2 వేలు స్కాలర్‌షిప్‌ అందిస్తామని సీఎం ప్రకటించారన్నారు. ఏటీసీల సెంటర్ల ఏర్పాటు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తమ హయాంలో ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ కాలేజీతోపాటు రైతు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. తాజాగా ఏటీసీ సెంటర్లతో సరస్వతీ నిలయంగా తీర్చిద్దుతామన్నారు. కమ్యూనిటీ హాళ్ళ నిర్మాణానికి రూ.10 కోట్ల మంజూరు చేశామన్నారు. అంబేద్కర్‌ విజ్ఞాన్‌ భవన్‌ నిర్మాణం కోసం రూ. కోటి, కాపు భవన నిర్మాణానికి రూ. 60 లక్షలు, మధున పోచ్చమ్మ ఆలయ అభివృద్ధికి రూ. 25 లక్షలు, వినాయక మండపం కోసం రూ. 10 లక్షలు, మహాలక్ష్మి ఆలయ అభివృద్ధికి రూ. 10 లక్షలు, చిన్నయ్య-పెద్దయ్య ఆలయానికి రూ. 10 లక్షలు, మహిళా భవనానికి రూ. 50 లక్షలు, రిటైర్డు ఉద్యోగుల రిక్రియేషన్‌ కోసం రూ. 50 లక్షలు కేటాయించామన్నారు. ప్రతి కమ్యూనిటీ వారు కమిటీలు ఏర్పాటు చేసుకొని భవనాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్మన్లు కుడుదుల వెంకన్న, వైనాల రాజు, ఈఆర్‌సీ మెంబర్‌ శశిభూషన్‌కాచే, మండల పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్‌, ఆర్టీవో మెంబర్‌ మంథని సురేష్‌, కాంగ్రెస్‌ నేతలు సెగ్గెం రాజేష్‌, ఆర్డీవో సురేష్‌, తహసీల్దార్‌ కుమారస్వామిలు పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2025 | 11:33 PM