డీఈవో అవినీతిపై విచారణ చేయాలి
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:12 AM
జిల్లా విద్యాధికారి అవినీతిపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరెట్ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యాధికారిని సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థి యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు అమరగాని ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ డీఈవో మాధవి అవి నీతి, అక్రమాలపై ఫిర్యాదులు చేసినా కలెక్టర్ స్పందించలేదన్నారు.
పెద్దపల్లిటౌన్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా విద్యాధికారి అవినీతిపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరెట్ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యాధికారిని సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థి యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు అమరగాని ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ డీఈవో మాధవి అవి నీతి, అక్రమాలపై ఫిర్యాదులు చేసినా కలెక్టర్ స్పందించలేదన్నారు. టీచర్ ట్రైనింగ్ క్యాంపుల నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిం చారన్నారు. సమగ్ర శిక్ష నిధుల వినియోగంలో జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా ఉన్న డీఈవో అవక తవకలకు పాల్పడ్డారన్నారు. కంప్యూటర్ల కొను గోళ్లలో, ప్రభుత్వ నిధుల వినియోగంలో ఆర్థిక అక్రమాలపై అధికారులు సంవత్సరం క్రితమే డీఈవోకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారని, ఆ నివేదికపై చర్యలెందుకు చేపట్టలేదో చెప్పాలన్నారు. ఇన్‌స్పైయిర్ అవార్డుల నిర్వహణకు ప్రభు త్వం నుంచి మంజూరైన లక్షలాది రూపాయల నిధులను డీఈవో మాధవి ప్రైవేట్ స్కూళ్ల నుంచి వసూలు చేసిన డబ్బుతో కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు. కార్యాలయంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని వసూళ్ళ కోసం ఏజెం ట్‌గా నియమించి, అన్ని లావాదేవీలను అతని ద్వారా నిర్వహిస్తున్నారని, అతని ఆన్‌లైన్ లావా దేవీలను పరిశీలిస్తే అవినీతి బయటపడు తుందని పేర్కొన్నారు. వివైఎస్‌ఎస్ జిల్లా అధ్య క్షుడు సిలివేరు మధు, గూడెపు జనార్దన్ రెడ్డి, రాజాం మహంత క్రిష్ణ, రామగిరి మహేందర్, జంగా కిరణ్ రెడ్డి, పంజాల రవీందర్ గౌడ్, వెంకటేశ్వర్లు, కొమ్మ ఐలయ్య, పెద్దోల్లా ఐలయ్య, దాడి రవీందర్, ఆలుబోజు రాజేందర్, దొడ్ల రాజయ్య, అశోక్ గౌడ్, మేరుగు కనకయ్య, కంచి శ్రీనివాస్, ఎల్లేష్ గౌడ్, అనిల్ పాల్గొన్నారు.