Share News

అధికారుల అత్యుత్సాహంతోనే కూల్చివేతలు

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:50 PM

రామగుండంలో అధికారులు అత్యు త్సాహంతో రోడ్ల పక్కన ఉన్న నిర్మాణాలను కూలగొట్టారని, దీనికి అధికార యంత్రాంగానిదే బాధ్యతని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. శుక్రవారం ప్రెస్‌ క్లబ్‌లో నాయకులు మహంకాళి స్వామి, కాల్వ లింగస్వామి, రామాలయ కమిటీ చైర్మన్‌ గట్ల రమేష్‌ మాట్లాడారు.

అధికారుల అత్యుత్సాహంతోనే కూల్చివేతలు

కళ్యాణ్‌నగర్‌, నవంబర్‌ 7(ఆంధ్రజ్యోతి): రామగుండంలో అధికారులు అత్యు త్సాహంతో రోడ్ల పక్కన ఉన్న నిర్మాణాలను కూలగొట్టారని, దీనికి అధికార యంత్రాంగానిదే బాధ్యతని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. శుక్రవారం ప్రెస్‌ క్లబ్‌లో నాయకులు మహంకాళి స్వామి, కాల్వ లింగస్వామి, రామాలయ కమిటీ చైర్మన్‌ గట్ల రమేష్‌ మాట్లాడారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ సొంత డబ్బులతో గుళ్లు నిర్మించిన చరిత్ర ఉందని కాంగ్రెస్‌ నాయకులు పేర్కొన్నారు. ఏ మతానికి చెందిన మనోభావాలను కించపరిచే సంస్కృతి కాంగ్రెస్‌ పార్టీది కాదన్నారు. ఈ ఘటనను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యేపై బురద జల్లేందుకు కొందరు నాయకులు పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నాడన్నారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ రామగుండంలో 108అడుగుల ఎత్తు గల ఆంజనేయస్వామి విగ్ర హం నిర్మిస్తున్నాడని, దీనికి సుమారు రూ.20కోట్లు వ్యయం అవుతుందని, తన సొంతగానే ఈ కార్యక్ర మాన్ని చేపట్టారన్నారు.

బుగ్గ ప్రాంతంలో రాజీవ్‌ రహ దారిపై ప్రమా దాలు జరుగుతు న్నాయని బసంత్‌నగర్‌ ఫ్లై ఓవర్‌ సమీపంలో దారిమైసమ్మ ఆలయాన్ని సుమారు రూ.1కోటితో నిర్మి స్తున్నారన్నారు. గోదావరిఖని కోదండ రామాలయం గాలిగోపురం, మెయిన్‌ చౌరస్తాలోని పోచమ్మ దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించారన్నారు. నాయకులు కొలిపాక సుజాత, ముస్తాఫా, తిప్పారపు శ్రీనివాస్‌, కొప్పుల శంకర్‌, దాసరి విజయ్‌, గడ్డం శ్రీనివాస్‌, సత్యనారాయణ, హమీద్‌, అఫిజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2025 | 11:50 PM