Share News

మార్కెట్‌లో షెడ్ల కూల్చివేతలు షురూ..

ABN , Publish Date - Dec 15 , 2025 | 12:23 AM

మంథని కూరగాయాల మార్కెట్‌ను తాత్కాలికంగా తరలించడానికి మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం మార్కెట్‌లో కూల్చివేతలు ప్రారంభించి ఒకపక్కన్న ఉన్న షెడ్లను ఎక్స్‌వేటర్‌తో కూల్చివేశారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో షెడ్లకూల్చివేతలు కొనసాగుతాయని చిరువ్యాపారు లను హెచ్చరించారు.

మార్కెట్‌లో షెడ్ల కూల్చివేతలు షురూ..

మంథని, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మంథని కూరగాయాల మార్కెట్‌ను తాత్కాలికంగా తరలించడానికి మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం మార్కెట్‌లో కూల్చివేతలు ప్రారంభించి ఒకపక్కన్న ఉన్న షెడ్లను ఎక్స్‌వేటర్‌తో కూల్చివేశారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో షెడ్లకూల్చివేతలు కొనసాగుతాయని చిరువ్యాపారు లను హెచ్చరించారు. దీంతో వారు బొక్కలవాగు వద్ద తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకోవటానికి స్థలా న్ని చదును చేసుకుంటున్నారు. మరోవైపు మున్సిపల్‌ పరంగా తాత్కాలికంగా తడకలతో గదులు ఏర్పాటు చేయించారు. స్థానికకూరగాయలు, చికెన్‌,మటన్‌ మార్కెట్‌ను తాత్కాలికంగా బొక్కలవాగు కట్టమీదకు తరలించడానికి మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది శని వారం చర్యలు చేపట్టారు.

రూ.7కోట్ల వెజ్‌, నాన్‌వెజ్‌ దుకాణాల నిర్మాణం..

రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కృషితో టీయూఎఫ్‌ఐడీసీ నుంచి రూ.7కోట్ల నిధులు ఏడాది న్నర క్రితం మంజూరయ్యా యి. ప్రస్తుతం మార్కెట్‌ ఉన్నస్థలంలో ఇంటిగ్రేటేడ్‌ వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌కు అధునాతన భవనాన్ని నిర్మించడానికి చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటికే నిధులు మంజూరైనప్పటికీ వ్యాపారుల తరలింపులేని కారణంగా నిర్మాణపనులలో జాప్యం జరుగుతుందనే ప్రచారంఉంది. దీంతో మున్సిపల్‌ కమిషనర్‌ మనో హర్‌ మార్కెట్‌తరలింపు, ఇంటి గ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ భవన నిర్మాణాన్ని ప్రారంభించడానికి వేగంగా చర్యలు తీసుకుం టున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతమార్కెట్‌ను బొక్కలవాగు కట్టపైకి తరలించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.

అందరికీ అనుకూలమైన స్థలంలోనే తాత్కాలిక మార్కెట్‌..

బస్టాండ్‌లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, గ్రౌండ్‌లో ఉంటే విద్యార్థుల విద్యాబోధనకు ఇబ్బంది అని మున్సిపల్‌ కమిషనర్‌, అధికారులు భావించి బొక్కలవాగు కట్టపై ఏర్పాటు చేస్తున్నారు. మార్కెట్‌ తరలింపు కోసం వ్యాపారులు సహకరించాలని వారు కోరుతున్నారు. కాగా మార్కెట్‌ లోని కూరగాయల వ్యాపారులు మార్కెట్‌ భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు తమకు బస్టాండ్‌లేదా ప్రభుత్వజూనియర్‌ కళాశాలగ్రౌండ్‌లో తాత్కాలికంగా కూరగాయలు అమ్ముకోవటానికి అనుమతి ఇవ్వాలని కోరారు.

మున్సిపల్‌ అధికారుల తీరుపై వ్యాపారుల ఆగ్రహం..

మార్కెట్‌ తరలింపునకు మున్సిపల్‌ అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, కూల్చివేత లతో దూకుడుగా హెచ్చ రికలు జారీచేయడంపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూత నవెజ్‌, నాన్‌వెజ్‌ భవన నిర్మాణం, మార్కెట్‌ను తాత్కాలికంగా తరలిం చడం, మార్కెట్‌లో షాపు లు షెడ్ల కూల్చివేతలపై కనీసం తమతో చర్చికుండా, తమ సందేహాలను నివృత్తి చేయకుండా నేరుగా కూల్చివేతలకు రావడం, బలవంతంగా తమను అక్కడినుంచి వెళ్లగొట్టే దూకుడు చర్యలను వారు వ్యతిరేకిస్తున్నారు. తర లింపునకు ముందే భవననిర్మాణం పూర్తయ్యాక తమకు షెడ్‌ల కేటాయింపులాంటి విషయాల్లో సందే హాలను తీర్చాలని లేనిపక్షంలో మున్సిపల్‌ అధికారుల చర్యలను ప్రతిఘటించాల్సి వస్తుందని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 15 , 2025 | 12:23 AM