దేశం కోసం సేవ చేసిన మహనీయుడు దీన్‌దయాల్
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:15 AM
దేశం కోసం నిస్వార్థంగా సేవ చేసిన మహనీయుడు, మానవతావాది పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ అని బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య అన్నారు. మంగళవారం పండిట్ దీన్‌దయాల్ ఉపా ధ్యాయ వర్థంతి సందర్భంగా శివాజీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కళ్యాణ్‌నగర్, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): దేశం కోసం నిస్వార్థంగా సేవ చేసిన మహనీయుడు, మానవతావాది పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ అని బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య అన్నారు. మంగళవారం పండిట్ దీన్‌దయాల్ ఉపా ధ్యాయ వర్థంతి సందర్భంగా శివాజీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ దీన్ దయాల్ సిద్ధాంతం ఆధారంగానే మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభు త్వ వికాసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తుందన్నారు. దీన్ దయాల్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడవా లని పిలుపునిచ్చారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుల్వ లక్ష్మీ నర్సయ్య, పెద్దపల్లి రవీందర్, మహవాది రామన్న, సోమా రపు అరుణ్, నవీన్, దాసరి శ్రీనివాస్, శివ, సతీష్, రాజు, అశోక్, స్వామి, శ్రావణ్ పాల్గొన్నారు.
అంతర్గాం: ఎల్లంపల్లిలో మంగళవారం దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతిని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు బొడకుంట సుభాష్ దీన్‌దయాల్‌ఉపాధ్యాయ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పాటు జన సంఘ్ అధ్యక్షుడిగా పనిచేసిన దీన్ దయాల్ ఉపాధ్యాయ గొప్ప మానవతావాది అని కొని యాడారు. నాయకులు మాడ ప్రభాకర్ రెడ్డి, అనిల్ రెడ్డి, ఆలకుంట మల్లేష్, బాలసాని సత్యంగౌడ్ పాల్గొన్నారు.
జూలపల్లి, (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని బస్టాం డ్ చౌరస్తాలో బీజేపీ మండల అధ్యక్షుడు కొప్పుల మహే ష్ ఆధ్వర్యంలో దీన్‌దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి దీన్‌దయాల్ ఉపాద్యాయ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పిం చారు. ఆయన మాట్లాడుతూ దీన్‌దయాల్ ఉపాధ్యాయ అట్ట డుగు వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా జనసంఘ్‌ను స్థాపించా డన్నారు. జేకే శేకర్‌యాదవ్, కంక నాల జ్యోతిబసు, మెండె రాజన్న, ఐలన్న, మెరుగు కనుకయ్య, పాల్గొన్నారు.