ఆవిర్భావ వేడుకలకు నిధుల్లో కోత సరికాదు
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:15 PM
సింగరేణి ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు యాజమాన్యం నిధుల కేటాయింపులో కోత విధిం చడం సరికాదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. శుక్ర వారం ప్రెస్‌భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో వేడుకల నిర్వహణకు 40 లక్షలకు పైగా వెచ్చించే వారని, ఈ ఏడాది 8లక్షలు కేటాయించడం సమంజసం కాదన్నారు.
యైుటింక్లయిన్‌కాలనీ, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): సింగరేణి ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు యాజమాన్యం నిధుల కేటాయింపులో కోత విధిం చడం సరికాదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. శుక్ర వారం ప్రెస్‌భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో వేడుకల నిర్వహణకు 40 లక్షలకు పైగా వెచ్చించే వారని, ఈ ఏడాది 8లక్షలు కేటాయించడం సమంజసం కాదన్నారు. ఆవిర్భావ వేడుకలు ఆయా ఏరియాల్లోని గ్రౌండ్‌లలో కార్మిక కుటుంబాలను భాగస్వాములు చేస్తూ పండుగలా నిర్వహించే స్థితి నుంచి ఉత్తమ కార్మికులు, క్రీడల్లో గెలిచిన వారికి బహుమతులు ఇవ్వలేని విధంగా కేటాయింపులు జరగడం సిగ్గుచేటన్నారు. మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు సింగరేణి రూ.10 కోట్లు ఇవ్వా ల్సిన అవసరం ఏమిటని, సివిల్స్ విద్యార్థులకు 4 కోట్లు, గోదావరిఖనిలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి 30 కోట్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 147 కోట్లు సింగరేణి నిధులను మళ్ళించాల్సిన అవసరం ఎందుకని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. రామగుండం కార్పొరే షన్ నిధుల ద్వారా చేయాల్సిన అభివృద్ధి పనులకు, దసరా ఉత్సవాలకు సింగరేణి నిధులను మళ్ళించడంపై కార్మికులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేలా బడ్జెట్ మం జూరు చేయాలని డిమాండ్ చేశారు. మాదాసు రామ్మూర్తి, నూనె కొం రయ్య, రవి, ప్రభాకర్‌రెడ్డి, చెల్పూరి సతీష్, హరిప్రసాద్, అనిల్‌రెడ్డి, అబ్బు శ్రీనివాస్‌రెడ్డి, బేతి చంద్రయ్య, తిరుపతి, రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.