Share News

బ్లాస్టింగ్‌లతో పంటలు దెబ్బతింటున్నాయి

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:22 AM

బొంపల్లి గుట్టపై క్వారీ బ్లాస్టింగ్‌లతో పంటలు దెబ్బతింటున్నాయని శుక్రవారం రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ధర్మారం రోడ్డుపై బైఠాయించారు. వెంటనే బ్లాస్టింగ్‌లను నిలిపివేయాలని నినాదాలు చేశారు.

బ్లాస్టింగ్‌లతో పంటలు దెబ్బతింటున్నాయి

పెద్దపల్లిరూరల్‌, సెప్టెంబరు 12 (ఆంఽధ్రజ్యోతి): బొంపల్లి గుట్టపై క్వారీ బ్లాస్టింగ్‌లతో పంటలు దెబ్బతింటున్నాయని శుక్రవారం రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ధర్మారం రోడ్డుపై బైఠాయించారు. వెంటనే బ్లాస్టింగ్‌లను నిలిపివేయాలని నినాదాలు చేశారు. రాస్తారోకో చేయడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సుమారు అరగంట సమయం వరకు ఆందోళన చేపట్టడంతో పోలీసులు చేరుకోని రైతులతో మాట్లాడి విరమింపజేశారు. ఈ సందర్భంగా సంబంధిత రైతులు మాట్లాడుతూ సర్వే నెంబర్‌ 179 లో గల సాగు భూములకు ఆనుకొని ఉన్న గుట్టను బ్లాస్టింగ్‌ చేయడం ద్వారా పంట పొలాల్లో రాళ్లు వచ్చి పడుతున్నాయని, దీంతో పంటలు సాగు చేసుకోలేని పరిస్థితి ఉందన్నారు. పలుమార్లు అధికారులకు, పోలీసులకు, ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై కోర్టుకు వెళ్లి స్టే కూడా తీసుకొచ్చామన్నారు. అయిన కూడా బ్లాస్టింగ్‌లు ఆపడం లేదన్నారు. అధికారులు స్పందించక పోవడం వల్లనే రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నామన్నారు. వెంటనే బ్లాస్టింగ్‌లను నిలిపివేసేలా అధికారులు చర్యలు చేపట్టి పొలాలు సాగు చేసుకునే విధంగా సహకరించాలని వారు కోరారు.

Updated Date - Sep 13 , 2025 | 12:22 AM