మంత్రి శ్రీధర్‌బాబుపై విమర్శలు సరికాదు
ABN , Publish Date - Jul 14 , 2025 | 12:06 AM
నిరు పేదల కోసం నిత్యం తప్పించే మంత్రి శ్రీధర్ బాబును విమర్శిస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్, పట్టణ అధ్య క్షుడు తిప్పారపు శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి శ్రీధర్‌బాబుపై పుట్ట మధు అనుచిత వ్యాఖ్యలను ఖండించారు.
కళ్యాణ్‌నగర్, జూలై 13(ఆంధ్రజ్యోతి): నిరు పేదల కోసం నిత్యం తప్పించే మంత్రి శ్రీధర్ బాబును విమర్శిస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్, పట్టణ అధ్య క్షుడు తిప్పారపు శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి శ్రీధర్‌బాబుపై పుట్ట మధు అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. మం థని ప్రజలు ఆదరించడం వల్లనే శ్రీధర్‌బాబు ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎమ్మెల్యే, విప్‌గా పని చేశారని, రాష్ట్ర ప్రభుత్వంలో కీల కంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. శ్రీనుబాబు ప్రతి గ్రామంలో ప్రజలకు సేవ చేయడంతో పాటు వారికి ఏ సమస్య వచ్చినా వెంట నిల బడుతున్నాడన్నారు.
పుట్ట మధుకు రాజకీయ బిక్ష పెట్టింది శ్రీపాదరావు అనే విషయం మరిచి పోవద్దన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ డిక్లరేషన్ చేస్తే బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జీర్ణించుకోవడం లేదని, పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు బీసీలకు చేసిందేమిటని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకానికి తెరలేపిం దంటూ చందర్ ప్రచారం చేయడం విడ్డూరం గా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులు మహం కాళి స్వామి, కాల్వ లింగస్వామి, సుతారి లక్ష్మణ్‌బాబు, గట్ల రమేష్, తాళ్లపల్లి యుగంధర్, ముస్తాఫా, చొప్పరి శ్రీనివాస్, దొంతుల కిరణ్ పాల్గొన్నారు.