Share News

సింగరేణి స్టేడియంలో క్రికెట్‌ పోటీలు

ABN , Publish Date - May 11 , 2025 | 11:43 PM

సింగరేణి ఆర్‌జీ-1 ఏరియాలోని జీడీకే 2ఇంక్లైన్‌, 11ఇంక్లైన్‌ ఉద్యో గులు ఆదివారం గోదావరిఖని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఫ్రెండ్స్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఇన్‌చార్జి సిర్ర మల్లికార్జున్‌ ఆధ్వర్యంలో క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లయ్య ప్రారంభించారు.

సింగరేణి స్టేడియంలో క్రికెట్‌ పోటీలు

గోదావరిఖని, మే 11(ఆంధ్రజ్యోతి): సింగరేణి ఆర్‌జీ-1 ఏరియాలోని జీడీకే 2ఇంక్లైన్‌, 11ఇంక్లైన్‌ ఉద్యో గులు ఆదివారం గోదావరిఖని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఫ్రెండ్స్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఇన్‌చార్జి సిర్ర మల్లికార్జున్‌ ఆధ్వర్యంలో క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లయ్య ప్రారంభించారు. ఇరు జట్ల క్రికెట్‌ టీం సభ్యులకు 11ఇంక్లైన్‌ ఏఐటీయూసీ ఇన్‌చార్జి సిద్దమల్ల రాజు, పిట్‌ సెక్రటరీ నాయిని శంకర్‌, సహాయ కార్యదర్శి గొడిశల నరేశ్‌ల సహాకారంతో టీ షర్ట్స్‌ పంపిణీ చేశారు.

సింగరేణి యువ కార్మికులు సెలవు రోజుల్లో విశ్రాంతి తీసుకోకుండా క్రికెట్‌ పోటీల్లో పాల్గొనడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుం దని, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారని ఎల్లయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచి సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్‌, సింగరేణి ఆర్‌జీ-1 స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ సంతోష్‌రెడ్డి, నాయకులు పొన్నాల వెంకటయ్య, చెప్యాల భాస్కర్‌, తాళ్ళపెళ్లి శ్రీనివాస్‌, జాన్‌ కెనడీ, ఏవీఎస్‌ ప్రకాశ్‌ పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 11:43 PM