Share News

సీపీఐ వందేళ్ళ వేడుకలను జయప్రదం చేయాలి

ABN , Publish Date - Nov 23 , 2025 | 11:33 PM

సీపీఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ వేడు కలు ఘనంగా నిర్వహిస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం గోదావరిఖని భాస్క ర్‌రావుభవన్‌లో సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) ఆర్‌జీ-1 బ్రాంచి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక కుటుంబాల సమ్మేళ నానికి హాజరయ్యారు.

సీపీఐ వందేళ్ళ వేడుకలను జయప్రదం చేయాలి

గోదావరిఖని, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): సీపీఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ వేడు కలు ఘనంగా నిర్వహిస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం గోదావరిఖని భాస్క ర్‌రావుభవన్‌లో సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) ఆర్‌జీ-1 బ్రాంచి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక కుటుంబాల సమ్మేళ నానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులు కమ్యూనిస్టుల పునరేకీకరణకు కృషి చేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో వందలాది మందిని చంపుతున్నా సుప్రీంకోర్టు సుమోటోగా కేసును స్వీకరించడం లేదన్నారు. 1942లో సిం గరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ను ఏర్పాటు చేసి కార్మిక హక్కుల కోసం ఏఐటీయూసీ పోరాటాలు చేసిందన్నారు. శేషగిరిరావు, మఖ్దూం మోహియోద్దీన్‌, సర్వదేవబట్ల రామనాథం, నల్లమల్ల గిరిప్రసాద్‌, మను బోతుల కొమరయ్య, విఠల్‌రావు లాంటి తెలంగాణ సాయుధ పోరాట యోధులు యూనియన్‌ను స్థాపించి కార్మిక హక్కుల కోసం నిరంతరం కృషి చేశారని, పలువురు కార్మిక నాయకులు ప్రాణ త్యాగం చేశారని ఆయన తెలిపారు. యూనియన్‌ శ్రేణులంతా పార్టీతో మమేకమై స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. బీజేపీ మతోన్మాదాన్ని ముందు పెట్టి అభ్యుదయ వాదులందరినీ లేకుండా చేస్తుందని, ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలన్నారు. కమ్యూనిస్టు పార్టీని పారిశ్రామిక ప్రాంతంలో బలోపేతం చేయాలని, అందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కోరారు. డిసెంబర్‌ 26న ఖమ్మంలో జరిగే సీపీఐ వంద సంవత్సరాల ఉత్సవాలను జయప్ర దం చేయాలని పిలుపునిచ్చారు. ఆర్‌జీ-1 బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్షకార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్‌, జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, నాయకులు మడ్డి ఎల్లాగౌడ్‌, ప్రకాష్‌, కవ్వంపల్లి స్వామి, గౌతం గోవర్ధన్‌, గోసిక మోహన్‌, కే కనకరాజు, కన్నం లక్ష్మీనారాయణ, కందుకూరి రాజారత్నం, రమేష్‌, రంగు శ్రీను, ఓదెమ్మ, ఆసాల రమ, విజయలక్ష్మి, ప్రీతం, సూర్య, ఎంఏ గౌస్‌, ప్రజానాట్యమండలి కళాకారులు ఎజ్జ రాజయ్య, డప్పు రాజు, జూల మోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 11:33 PM