Share News

సీపీఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Jul 14 , 2025 | 12:04 AM

ఈనెల 17న జరగనున్న భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్థన్‌ పిలుపునిచ్చారు. ఆదివారం ఆర్జీ-2 ఏఐటీయూసీ ఆఫీస్‌లో జరిగిన కమాన్‌పూర్‌ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సీపీఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి

యైుటింక్లయిన్‌కాలనీ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఈనెల 17న జరగనున్న భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్థన్‌ పిలుపునిచ్చారు. ఆదివారం ఆర్జీ-2 ఏఐటీయూసీ ఆఫీస్‌లో జరిగిన కమాన్‌పూర్‌ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ వందేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ మహాసభలు నిర్వహించి, పార్టీ బలోపేతం దిశగా జాతీయ నాయకత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

దీనిలో భాగంగా ఈనెల 17న పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్‌ఎస్‌ గార్డెన్‌లో నిర్వహించనున్న జిల్లా మహాసభకు సింగరేణి కార్మికులు, కమాన్‌పూర్‌ మండలం, రామగుండం కార్పొరేషన్‌ కార్యకర్తలు హాజరు కావాలని గౌతంగోవర్థన్‌ సూచిచాఆరు. ఈమహాసభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు తెలిపారు. ఈసమావేశంలో మండల కార్యదర్శి రాజారత్నం, ఎల్‌ ప్రకాష్‌, జిగురు రవీందర్‌, బుర్ర తిరుపతి, కొండ్ర సత్యనారాయణ, కొంకటి రాజయ్య పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 12:04 AM