Share News

సీపీఐ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

ABN , Publish Date - May 30 , 2025 | 11:42 PM

సీపీఐ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్థన్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం కమాన్‌పూర్‌ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏఐటీయూసీ ఆఫీస్‌లో జరిగింది.

సీపీఐ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

యైుటింక్లయిన్‌కాలనీ, మే 30(ఆంధ్రజ్యోతి): సీపీఐ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్థన్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం కమాన్‌పూర్‌ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏఐటీయూసీ ఆఫీస్‌లో జరిగింది. గోవర్థన్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఉద్యమాలు చేయాలని సూచించారు.

కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రెవేట్‌ పరం చేస్తున్నదని, ఆపరేషన్‌ కగార్‌ పేరిట మావోయిస్టులను కిరాతకంగా చంపడాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని, కొత్త రేషన్‌ కార్డులను అమలు చేయలేదన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రకాష్‌, రాజారత్నం, బుర్ర తిరుపతి, జిగురు రవీందర్‌, సెగ్గం శంకర్‌, ఆంజనేయులు, రవికుమార్‌, రాజు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 11:42 PM