ఘనంగా సీపీఐ శత జయంతి ఉత్సవాలు
ABN , Publish Date - Dec 26 , 2025 | 11:55 PM
రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో భాస్క రరావు భవన్, ఖని చౌరస్తాలో శుక్రవారం సీపీఐ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వ హించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, గోసిక మోహన్‌లు పతకాల ను ఆవిష్కరించారు.
గోదావరిఖని, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో భాస్క రరావు భవన్, ఖని చౌరస్తాలో శుక్రవారం సీపీఐ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వ హించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, గోసిక మోహన్‌లు పతకాల ను ఆవిష్కరించారు. వివిధ డివిజన్‌లోని సీపీఐ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం భాస్కరరావు భవన్‌లో, చౌరస్తాలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యు లు గౌతం గోవర్ధన్, గోసిక మోహన్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆర్‌జీ-1 బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషంలు మాట్లాడారు. దేశంలో 1925 డిసెంబర్ 26న సీపీఐ కాన్పూర్‌లో ఆవిర్భవిం చినప్పటి నుండి అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిం దన్నారు. చట్టసభల్లో కార్మికుల కర్షకుల విద్యా ర్థులకు అనేక చట్టాలు చేసిన ఘనత సీపీఐ పార్టీదేనన్నారు. పార్టీ వందేళ్ళు పూర్తి చేసు కున్న సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో నిర్వహించే శత జయంతి ముగింపు ఉత్సవాల సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజానాట్యమండలి కళాకారులు కన్నం లక్ష్మీ నారాయణ, ఎజ్జ రాజయ్య, డప్పు రాజు గేయా లు ఆలపించి, పార్టీ శ్రేణులను చైతన్యపరిచారు. మార్కపురి సూర్య, సిర్ర మైసయ్య, తొడుపు నూరి రమేష్ కుమార్, మల్లయ్య, శంకర్, భూమయ్యలు మల్లయ్య, పాల్గొన్నారు.