కక్షిదారుల సౌలభ్యం కోసమే కోర్టుల ఏర్పాటు
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:35 AM
కక్షిదారుల సౌలభ్యం కోసమే రాష్ట్రంలో నూతన కోర్టుల ఏర్పాటు చేస్తున్నట్లు తద్వారా కేసులు సకా లంలో పరిష్కరించే అవకాశం ఉందని హైకోర్టు జస్టిస్, పెద్దపల్లి జిల్లా ఆడ్మినిస్ట్రేటివ్ జడ్జి లక్ష్మీనారా యణ అలిశెట్టి అన్నారు. సుల్తానాబాద్ కోర్టు ఆవర ణలో ఏర్పాటు చేసిన అదనపు కోర్టును హైకోర్టు జస్టిస్‌లు లక్ష్మీనారాయణ, పుల్ల కార్తీక్, జె శ్రీనివాస రావులు శనివారం ప్రారంభించారు.
సుల్తానాబాద్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కక్షిదారుల సౌలభ్యం కోసమే రాష్ట్రంలో నూతన కోర్టుల ఏర్పాటు చేస్తున్నట్లు తద్వారా కేసులు సకా లంలో పరిష్కరించే అవకాశం ఉందని హైకోర్టు జస్టిస్, పెద్దపల్లి జిల్లా ఆడ్మినిస్ట్రేటివ్ జడ్జి లక్ష్మీనారా యణ అలిశెట్టి అన్నారు. సుల్తానాబాద్ కోర్టు ఆవర ణలో ఏర్పాటు చేసిన అదనపు కోర్టును హైకోర్టు జస్టిస్‌లు లక్ష్మీనారాయణ, పుల్ల కార్తీక్, జె శ్రీనివాస రావులు శనివారం ప్రారంభించారు. సుల్తానాబాద్‌లో జూనియర్ సివిల్ జడ్జి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఉం డగా అదనంగా మరో కోర్టును ప్రభు త్వం మంజూరు చేసింది. అదనపు కోర్టును ప్రస్తుత కోర్టు ఆవరణలో ఉన్న భవనంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావే శంలో హైకోర్టు జస్టిస్‌లు మాట్లాడు తు కోర్టుల్లో చాలా కేసులు పెండింగ్ ఉంటున్నాయని, దీంతో దీర్ఘకాలంగా కోర్టుల చుట్టు తిరుగుతు వారు వ్యయ ప్రయాసాలకు గురవుతు న్నారని, కక్షిదారుల సౌలభ్యం కోసం, సత్వరంగా న్యాయం అందించడంలో భాగంగా అదనంగా కోర్టు లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కక్షిదారు లకు న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగించేలా న్యాయ వాదులు వృత్తిలో నైపుణ్యతలను పెంచుకోవా లన్నా రు. సుల్తానాబాద్ కోర్టుకు విశాలమైన స్థలం ఉం దని ఇక్కడ సబ్ కోర్టు, జిల్లా కోర్టును ఏర్పాటు చే యాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతిరెడ్డి వినతి పత్రం అందజేశారు. హైకోర్టు జస్టిస్‌లను సన్మానించారు.రామగుండం పోలీస్ కమి షనర్ అంబర్ కిషోర్‌ఝా వారికి పుష్ప గుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. జిల్లా జడ్జి సునీత కుంచాల, అదనపు జిల్లా జడ్జి టి శ్రీనివాస్‌రావు, జూ నియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్, జిల్లాలోని ప లువురు జడ్జిలు, డీసీపీ రాంరెడ్డి, బార్ అసోసియే షన్ కార్యదర్శి భూమయ్య, ఏపీపీ శ్యామ్ ప్రసాద రావు, ఏజీపీ దూడం అంజయనేయులు, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నేరెళ్ల శంకరయ్య, సీనియర్ న్యాయ వాదులు దివాకర్‌రావు, ఆంజనేయులు, బాలకిషన్ ప్రసాద్, శ్రీనివాసరావు, వొడ్నాల రవీందర్, శ్రీరాము లు,సత్యనారాయణ, సరోత్తంరెడ్డి,ఆవుల శివకృష్ణ, సా మల రాజేంద్రప్రసాద్, గుడ్ల వెంకటేష్ పాల్గొన్నారు.