కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి విక్రయించాలి
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:43 PM
పత్తి రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఆదివారం రాఘవ పూర్ శ్రీరామ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
పెద్దపల్లి రూరల్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): పత్తి రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఆదివారం రాఘవ పూర్ శ్రీరామ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పత్తికి 8 శాతం తేమ ఉంటే క్వింటాల్‌కు రూ.8110 మద్దతు ధర వస్తుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 200 యూనిట్‌ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రేషన్ కార్డు జారీ, మహిళలకు వడ్డీలేని రుణాలు, సన్నవడ్లకు బోనస్ అమలు చేస్తున్నామ న్నారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రవీణ్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌లు ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాష్‌రావు, మాజీ సర్పంచ్ ఆడెపు వెంకటేషం పాల్గొన్నారు.