Share News

పాత పద్ధతి ప్రకారమే పత్తి కొనుగోలు చేయాలి

ABN , Publish Date - Nov 18 , 2025 | 11:28 PM

కొత్త నిబంధనలు ఎత్తివేసి, పాత పద్ధతిలోనే పత్తి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సూచించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో అధికారులతో మాట్లాడి రాజీవ్‌ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పాత పద్ధతి ప్రకారమే పత్తి కొనుగోలు చేయాలి

పెద్దపల్లిటౌన్‌, నవంబరు 18 (ఆంఽధ్రజ్యోతి): కొత్త నిబంధనలు ఎత్తివేసి, పాత పద్ధతిలోనే పత్తి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సూచించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో అధికారులతో మాట్లాడి రాజీవ్‌ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గి రైతులు ఆవేదన చెందుతున్న నేపథ్యంలో కొత్త నిబంధనలు తీసుకువచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తేమ శాతం, దిగుబడిలో 25 శాతం కొనుగోలు చేస్తామని, వివిధ రకాల యాప్‌లతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఇలాంటి నిబంధనల వల్ల రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.

కేంద్రంలో రాష్ర్టానికి చెందిన ఇద్దరు మంత్రులు, ఆరుగురు ఎంపీలు ఉన్న రైతుల పక్షాన నిలబడడం లేదన్నారు. దీంతో జిన్నింగ్‌ మిల్లులు సమ్మెబాట పట్టాయన్నారు. రైతులు ఎక్కడా పత్తి అమ్ముకోవాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎకరాకు 7 క్వింటాళ్ళ పత్తి కొనుగోలు ఎత్తి వేసి రైతు దిగుబడి మొత్తం కొనుగోలు చేయాలని, కనీస మద్దతు ధర రూ.8,110కి తగ్గకుండా కొనుగోలు చేయాలని సూచించారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి పాత పద్దతిలో సేకరించాలని, లేకుంటే రైతుల పక్షాన పోరాటాలు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. జడ్పీ మాజీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌, రఘవీర్‌సింగ్‌, మర్కు లక్ష్మన్‌, ఉప్పు రాజ్‌కుమార్‌, లూశెట్టి భిక్షపతి, పెంచాల శ్రీధర్‌, కొయ్యడ సతీష్‌, వెన్నం రవీందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2025 | 11:28 PM