Share News

మూడు రోజులు పత్తి కొనుగోళ్లు నిలిపివేత

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:03 PM

మూడు రోజుల పాటు జిల్లాలోని మార్కెట్‌ యార్డులు, సీసీఐ కేంద్రాలకు పత్తి తీసుకురావద్దని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష రైతులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో పత్తి కొనుగోళ్లపై నిర్వహించిన సమావేశంలో మాటా ్లడుతూ పత్తి జిన్నింగ్‌ మిల్లు అసోసియేషన్‌ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిన్నింగ్‌ మిల్లర్లు, సీసీఐ, ప్రైవేటు కొనుగోలు నిలిపివేస్తున్నారని కలెక్టర్‌ పేర్కొన్నారు.

మూడు రోజులు పత్తి కొనుగోళ్లు నిలిపివేత

పెద్దపల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): మూడు రోజుల పాటు జిల్లాలోని మార్కెట్‌ యార్డులు, సీసీఐ కేంద్రాలకు పత్తి తీసుకురావద్దని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష రైతులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో పత్తి కొనుగోళ్లపై నిర్వహించిన సమావేశంలో మాటా ్లడుతూ పత్తి జిన్నింగ్‌ మిల్లు అసోసియేషన్‌ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిన్నింగ్‌ మిల్లర్లు, సీసీఐ, ప్రైవేటు కొనుగోలు నిలిపివేస్తున్నారని కలెక్టర్‌ పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు రైతులు మార్కెట్‌కు, జిన్నింగ్‌ మిల్లు వద్దకు పత్తి తీసుకురావద్దన్నారు. సీసీఐ విధించిన నిబంధనలో ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 విధానం పక్క జిల్లాల రైతులను అనుమతించడం, పత్తి రైతు ఎకరానికి 7 క్వింటాలు అమ్ముకునే వీలు కల్పించే విషయంలో వెసలుబాటు కల్పించే వరకు కొనుగోలు నిలిపేస్తున్నామని జిన్నింగ్‌ మిల్లు అసోసియేషన్‌ ప్రకటించిందన్నారు. జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌ రెడ్డి, కాటన్‌ మార్కెట్‌ కమిటీ కార్యదర్శులు, పోలీస్‌, రవాణా, అగ్నిమాపక శాఖ సీసీఐ అధికారులు, జిన్నింగ్‌ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.

పెండింగ్‌ సీఎంఆర్‌ రైస్‌ను

8వ తేదీలోగా పూర్తి చేయాలి

గతేడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పెండింగ్‌ సీఎంఆర్‌ రైస్‌ డెలివరీ ఈనెల 8వ తేదీ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు. మంగళవా రం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లా డుతూ ఖరీఫ్‌ 2024 సీజన్‌కు సంబంధించి 99.5 శాతం డెలివరీ పూర్తి చేసి రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలోని 11 రైస్‌ మిల్లుల పరిధిలో మరో 29 ఏసీకే రైస్‌ సరఫరా పెం డింగ్‌ ఉందని, పెండింగ్‌ రైస్‌ డెలివరీ కూడా గడువు లోగా పూర్తి చేయాలన్నారు. రబీకి సంబంధించి రైస్‌ డెలివరీ కూడా గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ మార్కెటిం గ్‌ సీజన్‌ ధాన్యం కేటాయింపునకు బ్యాంకు గ్యారంటీ అందించడం తప్పనిసరని కలెక్టర్‌ తెలిపారు. మిల్ల ర్లందరు తప్పనిసరిగా బ్యాంకు గ్యారంటీ సమర్పిం చాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్‌, మేనేజర్‌ శ్రీకాంత్‌, రైస్‌ మిల్లర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 11:03 PM