సహకార సంఘాలు ఆదర్శంగా ఉండాలి
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:31 AM
ప్రాథమిక సహకార సంఘాలు రైతులకు సేవలు అందిస్తూ ఆదర్శంగా ఉండాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో వన మహోత్సవంలో ఎమ్మెల్యే పండ్ల మొక్కలు నాటారు.
ఎలిగేడు, జూలై 7(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక సహకార సంఘాలు రైతులకు సేవలు అందిస్తూ ఆదర్శంగా ఉండాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో వన మహోత్సవంలో ఎమ్మెల్యే పండ్ల మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 90 శాతం మంది రైతులు వరి సాగు చేస్తూ రికార్డు స్థాయిలో దిగుబడులు సాధించారని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎలాంటి కటింగ్‌లు లేకుండా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామని తెలిపారు. గోదాం నిర్మాణానికి నాబార్డు ద్వారా నిధులు అందిస్తే నెల రోజుల్లో కలెక్టర్‌తో మాట్లాడి భూమిని సేకరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కొందరు కావాలని ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాబార్డు ఏజీఎం జయ ప్రకాష్ మాట్లాడుతూ బ్యాంకుల్లో వంద శాతం డిజిటలైజేషన్ చేసుకోవాలన్నారు. జిల్లాలో సోలార్ యూనిట్లకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. రైతులు, ప్రజలకు ఉపయోగ పడే యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. పీఏసీఎస్ చైర్మన్ గోపు విజయభాస్కర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణరావు, డీసీఓ శ్రీమాల, రిజిస్టార్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ యాకన్నా, ఎంపీడీవో భాస్కర్ రావు, పాలకవర్గ సభ్యులు, కార్యదర్శి కేశెట్టి విక్రమ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్ రెడ్డి, దుగ్యాల సంతోష్ రావు, అర్షనపల్లి వెంకటేశ్వర్ రావు, కోరుకంటి వెంకటేశ్వర్ రావు, కొండ తిరుపతి గౌడ్, పల్లెర్ల వెంకటేష్ గౌడ్, బూర్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ముప్పిరితోటలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. లోకపేట, ముప్పిరితోట గ్రామాల్లో ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పేదలకు ఇండ్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. అర్హులైన వారికి ప్రతీ పథకం అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. పెద్దపల్లి దేవ రాజు, కోట ఐలయ్య, శ్రవణ్, శ్రీనివాస్, మల్లేష్, పాల్గొన్నారు.