Share News

సహకార సంఘాలు ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించాలి

ABN , Publish Date - Nov 10 , 2025 | 11:47 PM

ఆయిల్‌ పామ్‌ సాగును వ్యవసాయ సహ కార సంఘాలు ప్రోత్సహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్ట రేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లడుతూ జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగును మరింత విస్తృత పరిచే దిశగా ,రైతులను వ్యవసాయ శాఖ, అధికారులు, సహకార సంఘాల చైర్మన్‌లు ప్రోత్సహించా లన్నారు.

సహకార సంఘాలు ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించాలి

పెద్దపల్లి, నవంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌ పామ్‌ సాగును వ్యవసాయ సహ కార సంఘాలు ప్రోత్సహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్ట రేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లడుతూ జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగును మరింత విస్తృత పరిచే దిశగా ,రైతులను వ్యవసాయ శాఖ, అధికారులు, సహకార సంఘాల చైర్మన్‌లు ప్రోత్సహించా లన్నారు. ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పరిధిలో కనీసం 100 ఎకరాలలో రాబోయే యాసంగి సీజన్‌ లో ఆయిల్‌ పామ్‌ పంట వేయించాలని అన్నారు. యాసంగి సీజన్‌ లో 2 వేల ఎకరాలకు తగ్గకుండా ఆయిల్‌ పామ్‌ పంట విస్తరణ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో నిర్మిస్తున్న తిరుమల ఆయిల్‌ కమ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫ్యాక్టరీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని కలెక్టర్‌ తెలిపారు.

ఆయిల్‌ పామ్‌ సాగులో మొక్కలు నాటేందుకు, డ్రిప్‌ ఇరిగేషన్‌ కు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని, వీటికి అదనంగా మొదటి నాలుగు సంవత్సరాలు ఆయిల్‌ పామ్‌ సాగు చేసే ప్రతి ఎకరానికి ప్రోత్సాహకం అందిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. రైతులకు ఆయిల్‌ పామ్‌ సాగు వల్ల మొదటి 3 సంవత్సరాల అంతర్‌ పంటల సాగుతో ఆదాయం పొందవచ్చని, నాల్గవ సంవత్సరం నుంచి లక్ష వరకు ఎకరానికి ఆదాయం సమకూరుతుందని, 30 ఏళ్లు వరకు రాబడి ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌, జిల్లా సహకార అధికారి శ్రీ మాల, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్‌ రెడ్డి, సంబంధిత అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2025 | 11:47 PM