కార్మికుల సమస్యల పై నిరంతర పోరాటం
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:01 AM
మున్సిపల్ శాఖలో పని చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు సీఐటీయూ ఆధ్వ ర్యంలో నిరంతరం పోరాడుతామని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జనగామ రాజమల్లు వెల్లడించారు.
మంథని, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ శాఖలో పని చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు సీఐటీయూ ఆధ్వ ర్యంలో నిరంతరం పోరాడుతామని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జనగామ రాజమల్లు వెల్లడించారు. మంథనిలో ఆదివారం జరిగిన తెలంగాణ మున్సి పల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ 4వ మహా సభలో ఆయన మాట్లాడుతూ.. పోరాటాల ద్వారానే అనేక సమస్యలు పరిష్కరించా మన్నారు.
ఐక్యంగా యూనియన్ బలోపేతం, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పట్టణంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, జిల్లా అధ్యక్షుడు మహేష్, నాయకులు బూడిద గణేష్, చింతల గోవింద్, ఆర్ల సందీప్, సురేష్, మంథని లింగయ్య, రవి, గడిపెల్లి మల్లేష్, చందు, గట్టయ్య, పాల్గొన్నారు.