ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలి
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:04 AM
ఇందిరమ్మ లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మండల కేంద్రంతోపాటు కోనరావుపేటలో శనివారం కలెక్టర్ పర్యటించారు. కోనరావుపేటలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణాలను పరిశీలించారు.
జూలపల్లి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మండల కేంద్రంతోపాటు కోనరావుపేటలో శనివారం కలెక్టర్ పర్యటించారు. కోనరావుపేటలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణాలను పరిశీలించారు. పనులను వేగవంతం చేసేందుకు చర్యలు చేప ట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థులకు అం దిస్తున్న విద్య, మధ్యాహ్నం భోజనం తదితర అంశాలపై ప్రధానోపాధ్యా యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవ లను, ఆసుపత్రిలోని వసతులను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యుడు సంపత్‌రెడ్డిని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని సబ్‌సెంటర్ల నిర్మాణ పనులను ప్రారంభించాల న్నారు. తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి రికార్డులను పరిశీలించిన కలెక్టర్ తహసీల్దార్ స్వర్ణకు సూచనలు చేశారు. మండలపరిషత్ కార్యాల యాన్ని తనిఖీచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారి శుధ్యం నిర్వహణను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హౌ జింగ్ పీడీ రాజేశ్వర్, ఎంపీడీవో పద్మజ, ఎంపివో అనిల్‌రెడ్డి, పంచాయతీ రాజ్ ఏఈ రాజశేఖర్, హౌజింగ్ ఏఈ నవ్య, ఎంఈఓ సరస్వతి అధికారులు ఉన్నారు.