హైస్కూల్ భవన నిర్మాణానికి శ్రీకారం
ABN , Publish Date - Aug 17 , 2025 | 11:59 PM
సుల్తానా బాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శిథిలావస్థలో ఉన్న గదులు కూల్చివేసి ఆ స్థలంలో కొత్తగా హైస్కూల్ భవన నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగాంగా పాత గదులు కూల్చివేయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా పరిషత్ హైస్కూల్ నిర్వహిస్తున్నారు.
సుల్తానాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): సుల్తానా బాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శిథిలావస్థలో ఉన్న గదులు కూల్చివేసి ఆ స్థలంలో కొత్తగా హైస్కూల్ భవన నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగాంగా పాత గదులు కూల్చివేయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా పరిషత్ హైస్కూల్ నిర్వహిస్తున్నారు. గతంలో ఈ హైస్కూల్ గదులనే కళాశాలకు ఉపయోగించారు. షిఫ్ట్ పద్ధతిలో ఉదయం, మధ్యాహ్నం పాఠశాల, కళాశాల నిర్వహించారు. కాలక్రమేణ హైస్కూల్ గదులు శిథిలావస్థకు చేరడం, తరగతుల నిర్వహణకు అనువుగా లేకపోవడంతో కళాశాల ముందు భాగంలో రాజీవ్ రహదారిని అనుకుని నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ పైన తరగతి గదులు నిర్వహిస్తున్నారు. అయితే రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న తరగతి గదులలో ఉండే విద్యార్థులకు వాహనాల రణగొన ధ్వనులు ఆటంకంగా ఉండేవి.
సమస్యను ఎమ్మెల్యే విజయరమ ణారావు గుర్తించి కలెక్టర్‌కు వివ రించారు. నూతన హైస్కూల్ భవన నిర్మాణానికి కలెక్టర్ కోటి న్నర నిదులు మంజూరు చేశా రు. దీంతో భవన నిర్మాణ పను లు చేపట్టనున్నారు. కళాశాలకు ఎలాంటి అంతరాయం లేకుండా హైస్కూల్ ముఖ ద్వారాన్ని సహకార బ్యాంక్ వైపు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థుల రాకపోకలు కూడా ఆ రోడ్డు గుండా సాగుతాయని అధికారులు తెలిపారు.