ఖనిలో క్లోజ్డ్ డ్రైన్ల నిర్మాణం
ABN , Publish Date - May 28 , 2025 | 12:06 AM
గోదావరిఖనిలోని ప్రధాన నాలా అడ్డగుం టపల్లి- కళ్యాణ్‌నగర్ - 2ఏ నాలాలను ఆధునీకరి స్తున్నారు. పట్టణంలోని ప్రధాన కాలనీల గుండా వెళ్లే ఈ నాలాతో దుర్గంధం వ్యాపి స్తుంది. ఈ నాలాను క్లోజ్డ్ డ్రైన్‌గా మార్చా లని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ప్రతిపాదిం చారు.
కోల్‌సిటీ, మే 27(ఆంధ్రజ్యోతి): గోదావరిఖనిలోని ప్రధాన నాలా అడ్డగుం టపల్లి- కళ్యాణ్‌నగర్ - 2ఏ నాలాలను ఆధునీకరి స్తున్నారు. పట్టణంలోని ప్రధాన కాలనీల గుండా వెళ్లే ఈ నాలాతో దుర్గంధం వ్యాపి స్తుంది. ఈ నాలాను క్లోజ్డ్ డ్రైన్‌గా మార్చా లని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ప్రతిపాదిం చారు. ఈ మేరకు అమృత్ 2 పథకంలో రూ.20 కోట్ల వ్యయంతో 2 కిలోమీటర్ల మేర డ్రైన్ నిర్మిస్తున్నారు. తిలక్‌నగర్ డౌన్ నుంచి ప్రారంభమయ్యే నాలాలు ఆర్‌ఎఫ్ సీఎల్ నుంచి వచ్చే నీరు, అడ్డగుంటపల్లి చెరువు ద్వారా ఎన్‌టీఆర్‌నగర్ నాలాకు చేరుతుంది. ఎన్‌టీఆర్‌నగర్ నుంచి కాలనీలు ఉన్నాయి. ఎన్‌టీఆర్ నగర్, మున్సి పల్ వర్కర్స్ కాలనీ, కళ్యాణ్‌నగర్, ఊర్వశి థియేటర్ ఏరియా, ఉల్లిగడ్డల బజార్, మేదరిబస్తీ, సీతానగర్, లెనిన్‌నగర్ మీదుగా 2ఏ మోరీ వద్దకు ఈ నాలా చేరుతుంది.
ఈ నాలాపై రూ.20కోట్ల వ్యయం తో ఎస్‌టీపీలు నిర్మిస్తున్నారు. నాలాను క్లోజ్డ్ డ్రైన్(బాక్స్‌టైప్)గా ఆధునీకరించను న్నారు. మంగళవారం ఈ డ్రైన్ ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు. కళ్యాణ్‌నగర్‌లో స్థానిక ప్రజలతో కొబ్బరికాయ కొట్టించి పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లా డుతూ రామగుండం నగరాభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నామని, క్లోజ్డ్ డ్రైన్ పద్దతిలో ఆధునీకరించడం వల్ల దుర్గంధం వ్యాపిం చదన్నారు. దీనిపై గ్రీనరీని అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎస్‌ఈ శివానంద్, ఈఈ రామన్, ప్రజారోగ్యశాఖ అధికా రులు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్, మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, కొలిపాక సుజాత, పాతపెల్లి ఎల్లయ్య, ముస్తాఫా, బాల రాజ్‌కుమార్, నాయకులు పెద్దెల్లి ప్రకాష్, గట్ల రమేష్, మారెల్లి రాజిరెడ్డి, పెద్దెల్లి తేజస్విని, దశరథం, రవీందర్ పాల్గొన్నారు.