ఎస్సీ వర్గీకరణ అమలులో పాలకుల కుట్ర
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:51 AM
ఎస్సీ వర్గీకరణ అమలులో పాలకుల కుట్ర ఆగలేదని, మాలలకు అన్యాయం జరిగిందని మాల మహా నాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పేర్కొన్నారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మద్దెల నర్సయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన సుధాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మాలలు వ్యతిరేకం కాదని, సామాజిక న్యాయం జరగటం లేదని విమర్శించారు.
పెద్దపల్లిటౌన్, సెప్టెంబరు 15 (ఆంఽధ్రజ్యోతి) ఎస్సీ వర్గీకరణ అమలులో పాలకుల కుట్ర ఆగలేదని, మాలలకు అన్యాయం జరిగిందని మాల మహా నాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పేర్కొన్నారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మద్దెల నర్సయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన సుధాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మాలలు వ్యతిరేకం కాదని, సామాజిక న్యాయం జరగటం లేదని విమర్శించారు. రోస్టర్ విధానం వల్ల శాతవాహన యూనివర్సిటీ లో 33 గెస్ట్ లెక్చరర్ పోస్టులు భర్తీలో ఒక్కరికి కూడా పోస్ట్ రాలేదని గుర్తు చేశారు.
రోస్టర్ విధానం తో పిల్లల భవిష్యత్తు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల 22 స్థానంలో మాలలు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం రోస్టర్ విధానం పై చర్చించి సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ చట్టాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారన్నారు. నవంబర్ 22న ఛలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, ఉపాధ్యక్షుడు ఆశాది పురుషోత్తం, నాయకులు ఎలుక దేవయ్య, జై భీమ్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కట్టెకోల మధు, నాయకులు మాదాసి చందు పాల్గొన్నారు.