Share News

ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ను నిలదీయాలి

ABN , Publish Date - Oct 10 , 2025 | 12:19 AM

మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిలు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి హాజరై పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్‌ పార్టీ బాకీ కార్డులు పంపిణీ చేశారు.

ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ను నిలదీయాలి

పెద్దపల్లిటౌన్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిలు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి హాజరై పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్‌ పార్టీ బాకీ కార్డులు పంపిణీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దిశా నిర్ధేశం చేశారు. వారు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాంగ్రెస్‌ బాకీ కార్డు పేరిట ఉద్యమాన్ని చేపట్టారన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చారని, వృద్ధులకు 4 వేలు, దివ్యాంగులకు 6 వేల పెన్షన్‌తో పాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ ఇలా ఇచ్చిన హామీల బకాయిలు పేరుకుపోతున్నాయని వివరించారు. .రైతు భరోసా కింద నాలుగెకరాల కౌలు రైతులకు 12 వేలు, ,రుణమాఫీ కింద 2 లక్షలు, సన్న వరి బోనస్‌ 5 వందలు, ఇలా చెప్పుకుంటు పోతే కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన సాధ్యం కాని హామీలన్ని బకాలుగా మారాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు బాకీ పడిన కార్డులు ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా ఇంటింటికీ చేరవేసేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కేసీఆర్‌ చేసిన సంక్షేమం అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు నిలదీసే విధంగా వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు యూరియా కొరత ఏర్పడిందని, కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే తెలంగాణ ప్రజలను రోడ్డును పడేసిందని ధ్వజమెత్తారు. రఘువీర్‌ సింగ్‌, గంట రాములు యాదవ్‌, వంగల తిరుపతిరెడ్డి, రాజ్‌ కుమార్‌, మర్కు లక్ష్మణ్‌, కొయ్యడ సతీష్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 12:19 AM