Share News

బడ్జెట్‌లో అన్యాయంపై కాంగ్రెస్‌ నిరసన

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:05 AM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేసిందని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ మండిపడ్డారు. ఆదివారం గోదావరిఖని చౌరస్తాలో పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు.

బడ్జెట్‌లో అన్యాయంపై కాంగ్రెస్‌ నిరసన

కళ్యాణ్‌నగర్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేసిందని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ మండిపడ్డారు. ఆదివారం గోదావరిఖని చౌరస్తాలో పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం నుంచి రూ.26 వేల కోట్ల పన్ను కడుతున్నా కేంద్ర ప్రభు త్వం కపట ప్రేమ చూపిస్తుందని విమర్శించారు. పదేళ్ళ బీఆర్‌ఎస్‌ పాలనలో మోదీతో చెట్టాపట్టా లేసుకుని తిరిగినా తెలంగాణకు నిధులు కేటాయిం చడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, 8మంది ఎంపీలు ఉన్నా తెలంగాణకు నిధులు తీసుకురాలేదని, దీనికి బీజేపీ ఎంపీలు సిగ్గుపడాలని, తెలంగాణకు బీజేపీ గుం డుసున్నా ఇచ్చిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, ఢిల్లీని ముట్టడించిన రైతులను ట్రాక్టర్లతో తొక్కించిందని, కార్మికుల హక్కులను కాలరాసి నాలుగు నల్ల చట్టాలను తీసుకువచ్చి ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసిందని ఆరోపిం చారు. నిరుద్యోగులకు కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఇవ్వలేదని, దేశంలో మత విద్వేశాలను రెచ్చగొడుతూ బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తోందన్నారు.

బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రజ లకు క్షమాపణ చెప్పాలని, ఇద్దరు కేంద్ర మం త్రులు, ఎంపీలు పార్లమెంట్‌లో నిరసన చేపట్టి నిధులు తీసుకురావాలని, లేకుంటే రాజీనామా చేసి గెలువాలని సవాల్‌ విసిరారు. నిర్మల సీతారామన్‌ ఆర్థిక శాఖ మంత్రి అయినప్పటి నుంచి తెలం గాణపై వివక్ష చూపుతుందని, తెలంగాణకు అన్యా యం చేస్తుందని, మా నిధులు, మా హక్కుల కోసం పార్లమెంట్‌ను ముట్టడిస్తామని మక్కాన్‌సింగ్‌ హెచ్చరించారు. కాంగ్రెస్‌ నాయకులు బంగి అనీల్‌ కుమార్‌, కాల్వ లింగస్వామి, మహంకాళి స్వామి, కొలిపాక సుజాత, పెద్దెల్లి ప్రకాష్‌, తేజస్విని, మారెల్లి రాజిరెడ్డి, సుతారి లక్ష్మణ్‌బాబు, బొమ్మక రాజేష్‌, చుక్కల శ్రీనివాస్‌, ఫజల్‌బేగ్‌, పాతిపెల్లి ఎల్లయ్య, శంకర్‌నాయక్‌, కొప్పుల శంకర్‌, నాయిని ఓదెలు, గడ్డం శ్రీనివాస్‌, దాసరి విజయ్‌, శివ పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2025 | 12:05 AM